
*రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పెను సంచలనం యువగళం పాదయాత్ర, నారా లోకేష్ సత్తా, సంకల్పం ప్రపంచానికి పరిచయం చేసిన పాదయాత్ర యువగళం.*
*రాష్ట్ర నలుదిశలా 226 రోజులు, 3132 కి.మీ.ల మేర సాగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రజాగళంగా మారి ప్రభంజనం సృష్టించింది.*
*అంబేద్కర్ రాజ్యాంగంను చేతబట్టి, హక్కుల్ని గుర్తు చేస్తూ, అరాచక ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూ, అడ్డంకులు ఎదుర్కొంటూ, అవమానాలను భరిస్తూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేటితో 3ఏళ్లు పూర్తి అయ్యాయి.*
*విద్యారంగ అభివృద్ధి కోసం నారా లోకేష్ చేస్తున్న కృషికి సంఘీభావంగా, నారా లోకేష్ యువగళం పాదయాత్ర స్మృతులను మననం చేసుకుంటూ, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ 11 నియోజకవర్గాల్లో భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.*
*226 రోజులు, 3132 కి.మీ.ల యువగళం పాదయాత్రను గుర్తుకు తెచ్చేలా జిల్లాలో 226 విద్యాసంస్థలను మోడల్ గా, ఉపాధి కల్పించే 26 స్కిల్ డెవెలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, 31320 సైకిళ్ల ఉచిత పంపిణీ చేపడుతున్నాం.*
*— బీద రవిచంద్ర MLC, టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు పార్లమెంట్.*
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర స్మృతులను మననం చేసుకుంటూ, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా వ్యాప్తంగా భారీ సేవా, అభివృద్ధి కార్యక్రమాలకు నేడు శ్రీకారం చుట్టింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో…. 3132 కి.మీ. పాదయాత్రకు గుర్తుగా 31320(పదింతలు) సైకిళ్లను, 226 రోజులకు గుర్తుగా 226 ప్రభుత్వ విద్యా సంస్థలను(జెడ్పీ హైస్కూల్స్, కళాశాలలు, ప్రభుత్వ హాస్టల్స్) మోడల్ గా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
“యువగళం పాదయాత్ర” జ్ఞప్తికి తెచ్చేలా…. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లో 26 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు సిద్ధం అవుతున్నాయి.
ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి దంపతులు, నెల్లూరులో మంత్రి నారాయణ గారు, సర్వేపల్లి లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కావలిలో బీద రవిచంద్ర గారు సైకిల్ పంపిణీ కార్యక్రమాలు వేగవంతం చేశారు.
వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ, గంగ ప్రసాద్ గార్ల నేతృత్వంలో పదివేల సైకిళ్ల పంపిణీకి కార్యాచరణ సిద్ధమవుతోంది. ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో సైకిళ్ల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.
నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ను గుర్తు చేసుకుంటూ, విద్యారంగ అభివృద్ధి కోసం నారా లోకేష్ గారు చేస్తున్న కృషికి మద్దతుగా జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి, సేవా కార్యక్రమాలతో నెల్లూరు తెలుగుదేశం పార్టీ సంఘీభావం పలుకుతోంది.
యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా, పెట్టుబడులు, పరిశ్రమలను తెచ్చేందుకు నారా లోకేష్ శ్రమిస్తున్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు తోడ్పాటు, పవన్ కళ్యాణ్ సహకారంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.
రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నారా లోకేష్ ప్రారంభించిన యువగళం ప్రజాగళంగా, నవగళంగా మారి దేశ రాజకీయాలను, నేతల దృష్టిని ఆకర్షించింది.
వ్యయ,ప్రయాసలకోర్చి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరాశ నిస్పృహలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న దీనపరిస్థితుల్లో వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తూ నాడు సాగిపోయింది యువగళం పాదయాత్ర.
త్రాగునీరు, సాగునీరు దొరకక రాయలసీమ రైతాంగం తల్లడిల్లుతున్న సమయంలో…. తాను రాయలసీమ ముద్దుబిడ్డనని చెప్పుకునే జగన్ తన హయాంలో ఒక్క ప్రాజెక్టు రాక, ఒక్క టీఎంసీ నీరు తేలేక చతికిలపడిన సమయంలో ధైర్యం నింపింది నారా లోకేష్ యువగళం పాదయాత్ర.
యువగళం పాదయాత్రలో అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా మారి కష్టమంటూ మొరపెట్టిన ప్రతి ఒక్కరి బాధ నారా లోకేష్ విన్నాడు, అండగా ఉన్నానని హామీ ఇచ్చాడు. పాదయాత్ర సాగిన ఆయా ప్రాంతాల, వర్గాల సమస్యలపై అధికారంలోకి వచ్చాక దృష్టి సారించారు నారా లోకేష్.
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలకు కూటమి ప్రభుత్వం సాయంతో పరిష్కారం చూపుతున్నారు నారా లోకేష్. భావి తరాల భవిష్యత్తు లక్ష్యంగా నవ్యాంధ్రప్రదేశ్ దిశగా లోకేష్ సాగిపోతున్నారు.
: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ ,జిల్లా టిడిపి అధ్యక్షులు*