
*విద్యుత్ భవన్, 30 నవంబర్ 2025*
*దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ కె.రాఘవేంద్రం గారు జిల్లాలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తో టెలికాన్ఫెరెన్సు నిర్వహించడం జరిగింది*
*జిల్లాలోని 5 డివిజన్లో మరియు విద్యుత్ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు*
*తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది సెలవులు రద్దు*
*ప్రతి ఒక్క ఉద్యోగి వారికి నిర్దేశించిన హెడ్ క్వార్టర్ లోనే ఉండాలి*
*విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచుకోవాలని సివిల్ విభాగం వారికి ఆదేశాలు జారీ*
:-*ఎస్.ఈ. శ్రీ కె. రాఘవేంద్రం*
ఈ సందర్భంగా ఎస్.ఈ. గారు మాట్లాడుతూ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండం గా మారి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని విద్యుత్ సిబ్బంది ప్రతి ఒక్కరిని నిర్దేశించిన హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది , మరియు సిబ్బందికి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. భారీ వర్షాలు పడుతాయని హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని ప్రజలందరూ విద్యుత్ విషయాలలో జాగ్రత్తలు పాటించాలని తడిచేత్తో విద్యుత్ పరికరాలను తాక వద్దని ఎక్కడైనా పోల్స్ పడినా మరియు విద్యుత్ లైన్స్ తెగిపడినాయని మీ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారికి తెలియజేయవలని, రైతులు ఎవరు తడిచేత్తో మోటార్ స్టాటర్ ఆన్ చేయవద్దని తెలిపారు, తడిచేత్తో ఇంటిలో ఉన్న స్విచ్ బోర్డులను కూడా ముట్టుకోవద్దని తెలిపారు.
జిల్లాలోని 5 విద్యుత్ డివిజన్లో అయిదు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కంట్రోల్ రూమ్స్ 24 గంటలు పని చేస్తాయని ప్రతి ఒక్క కంట్రోల్ రూమ్ లో జూనియర్ ఇంజనీర్ ఉంటారని తెలిపారు
వర్షాలు తగ్గే వరకు ప్రతి ఒక్క సబ్ స్టేషన్ లో ఇద్దరిని మాత్రమే ఉంచి మిగిలిన ఇద్దరిని అత్యవసర సేవలకు ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఛార్జింగ్ మరియు బ్యాకప్ ఉంచుకోవాలని కమ్యూనికేషన్ అనేది అన్నింటికీ ముఖ్యం అని తెలిపారు. రోప్స్ మరియు డ్రిల్లింగ్ మిషన్ లను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.మ్యాన్ పవర్ ఎక్కువుగా ఉంచుకోవాలని తెలియచేసారు.