*దామిశెట్టి ఉత్తర క్రియలకు హాజరైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే*
*కావలి పట్టణం లోని దామిశెట్టి శ్రీనివాసుల నాయుడు ఉత్తరక్రియలకు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తో కలిసి హాజరై వారి చిత్ర పటానికి నివాళులు అర్పించిన బీద రవిచంద్ర*
*ఈ సందర్భంగా బీద మాట్లాడుతూ..*
కావలి డిబిఎస్ కళాశాల ఛైర్మన్ దామిశెట్టి శ్రీనివాసుల నాయుడు మరణం కావలి కి తీరని లోటు.
నాలుగు దశాబ్దాల పాటు సర్పంచి గా, కౌన్సిలర్ గా, రైస్ మిల్లర్స్, ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ లలో విశిష్ట సేవలను అందించారు.
దామిశెట్టి శ్రీనివాసుల నాయుడు కుటుంబ సభ్యులు సైతం ఎంపీటీసీ,ఎంపీపీ, జడ్పీటీసీ, కేంద్ర సహకార బ్యాంక్ సభ్యులు గా సేవలను అందిస్తూ ప్రజా జీవితం లో ఉన్నారు.
కాంగ్రెస్, టిడిపి, వైసీపీ లో ఉన్నప్పటికి పార్టీలకు అతీతంగా అందరితో సఖ్యత గా వ్యవహరించే గొప్ప వ్యక్తి దామిశెట్టి శ్రీనివాసుల నాయుడు.
దామిశెట్టి శ్రీనివాసుల నాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.