*దళారులను నమ్మి మోసపోవద్దు : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*

– ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందండి
– అందుబాటులో 5 లక్షల గన్ని బ్యాగ్స్

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్మి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌర సరఫరాలు,ఆహారం,వినియోగ దారుల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ రైతులకు సూచించారు.

బుధవారం నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈరోజు అసెంబ్లీ లోని మంత్రి ఛాంబర్ నందు సమావేశం జరిగింది.ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

నెల్లూరు జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని దీంతో రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోతున్న విషయం ప్రజా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి తక్కువ రేటు కు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్ద అన్నారు. ఇప్పటికే జిల్లాలో 46% వరి కోతలు పూర్తయ్యాయన్నారు.పండించిన ధాన్యాన్ని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్మి 24 గంటల లోనే డబ్బు పొంద వచ్నన్నారు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని భరోసానిచ్చారు.

ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని,ఐదు లక్షల గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు పర్యటించి, ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకునేందుకు చొరవ చూపాలన్నారు.రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. అదేవిధంగా ప్రతి మిల్లు వద్ద రెవెన్యూ సిబ్బంది ఉండే విధంగా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో సంఘం, కొవ్వూరు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు ముమ్మరంగా జరుగుతుందన్నారు.
ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ అవుతుందన్నారు. రైస్ మిల్లర్ అసోసియేషన్ తో మాట్లాడి దళారుల ప్రమేయం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే రైతుకు ఇబ్బంది లేకుండా ప్రకాశం, బాపట్ల కందుకూరు తదితర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్,సర్వేపల్లి శాసన సభ్యలు సోమిరెడ్డి చంద్ర మోహన రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, వెంకటగిరి ఎమ్మెల్యే కే. రామకృష్ణ , కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి లతో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *