
త్వరలోనే అనుమతులు లేని లేవుట్స్ ని ధ్వంసం చెయ్యబోతున్నాం : నుడా చైర్మన్ కోటంరెడ్డి హెచ్చరిక
– LRS కి దరఖాస్తు చేసుకోకుండా లేవుట్ ఓనర్స్ డ్రామాలు చేస్తున్నారు.
– అనుమతులు లేకుండా వింజమూరు లేవుట్ కి కరెంట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవు
– వరికుంటపాడు, వింజమూరులో నుడా అనుమతులు లేకుండా లేవుట్స్ వేస్తున్నారు..
– నుడా కి, LRS కి సహకరించని ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులపై చర్యలకు సిపారసు
– LRS అమలులో కఠినంగా ఉంటాం.. అనుమతులు తీసుకోకపోతే భవిష్యత్తులో లేవుట్స్ కూల్చడం ఖాయం
– LRS చేసుకోమని ఎమ్మెల్యేలు సైతం చెబుతున్నా.. లేవుట్స్ ఓనర్స్ ముందుకు రావడం లేదు..
– ఇది వైసీపీ ప్రభుత్వం కాదనే విషయాన్నీ లేవుట్ ఓనర్స్, కొందరు అధికారులు గుర్తు పెట్టుకోవాలి..
– అనుమతులు లేని లేవుట్స్ లో ఎవ్వరూ ప్లాట్స్ కొని మోసపోవద్దు..
– ధ్వంసం చేసిన లేఔట్స్ కి భవిష్యత్తులో LRS దరఖాస్తు చేసుకున్నా.. అనుమతులు ఇవ్వబోము..
నుడా పరిధిలో అనుమతులు లేని లేఅవుట్స్ని త్వరలోనే ధ్వంసం చేయబోతున్నామని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం LRS స్కీమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చినా.. చాలామంది ఆ స్కీం ని పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నుడా పరిధిలో 437 లేవుట్స్ ఉంటే.. కేవలం 23 లేవుట్స్ కి మాత్రం దరఖాస్తులు వచ్చాయన్నారు. కొందరు ఎంపీడీవోలు పంచాయతీ అధికారులు లేఅవుట్ ఓనర్లతో కుమ్మక్కయ్యారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా వింజమూరు, వరికుంటపాడులో లేవుట్స్ వేస్తున్నారని అన్నారు. వింజమూరులో అనుమతి లేకుండా వేసిన లేఔట్ కు కరెంటు సప్లై ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లేఅవుట్ ఓనర్స్ అనుమతులు తీసుకోకుండా డ్రామాలు చేస్తున్నారని.. అక్రమార్జనకు అలవాటు పడ్డారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న నుడా అధికారులకు సైతం పంచాయతీ కార్యదర్శులు సహకరించడం లేదని మండిపడ్డారు. అక్టోబర్ 23 లోపు LRS కి దరఖాస్తు చెయ్యకపోతే… ఒక్కో లేవుట్ ని ధ్వంసం చేసుకుంటూ పోతామని హెచ్చరించారు. ధ్వంసం అయిన తర్వాత ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసినా ప్రయోజనం ఉండదని.. అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు. ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు సైతం LRS ను ఉపయోగించుకోవాలని.. లేఅవుట్ ఓనర్స్ పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ముడా అధికారుల మంచితనాన్ని అసమర్థతగా తీసుకుంటున్నారని.. తామెంటో చూపిస్తామన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం కాదని.. లే అవుట్ ఓనర్స్, కొందరు అధికారులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. అనుమతులు లేని లేఅవుట్ ని ధ్వంసం చేసే అధికారం నుడాకి ఉంటుందని స్పష్టం చేశారు. అనుమతులు తీసుకొని లేఅవుట్ ఓనర్స్ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని.. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని కోటంరెడ్డి హెచ్చరించారు.. ఈ మీడియా సమావేశంలోఆలంపాటి పెన్సిల్ రెడ్డి, పీవో హిమబిందు, ఖలేషా, అపియో కుముధుని, చంద్ర, సుష్మాంజలి నుడా అధికారులు పాల్గొన్నారు