
*తెలుగుదేశంపార్టీలో కార్యకర్తే అధినేత*
*కోవూరులో అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారం*
*ప్రతి గ్రామంలో టిడిపి పతాకం ఎగరాలి : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి*
భారతదేశంలో సామాజిక న్యాయం అమలు చేసిన ఏకైక పార్టీ టిడిపి.
– అంకితభావం కలిగిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం.
– మహానేత ఎన్టీఆర్ గారి ఆశీర్వాదాలు, చంద్రబాబు లోని నాయకత్వ లక్షణాలు కలగలసిన యువ కిషోరం నారా లోకేష్.
– టిడిపి సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళదాం.
– వారానికోరోజు పార్టీ కోసం కేటాయించండి, గ్రామ పరిధిలో సచివాలయ సిబ్బందితో కలిసి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయండి.
– చంద్రబాబు నాయుడుకి ఓటరుకి మధ్య కార్యకర్తలే వారధులు.
– రాష్ట భవిష్యత్తు కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు మనకు నిత్య స్ఫూర్తి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆత్మీయ ఆశీర్వాదాలతో చంద్రబాబు గారి నాయకత్వంలో యువనేత మంత్రి లోకేష్ గారి ప్రేరణతో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లడంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. కోవూరు నియోజకవర్గ కేంద్రంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల అధ్యక్షులు, యూనిట్, క్లస్టర్, బూత్ కమిటీల కన్వీనర్లు మరియు పార్టీ అనుబంధ విభాగాలలో పదవులు పొందిన నాయకులచే ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశం పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ప్రత్యేకంగా రూపొందించిన టిడిపి కేక్ కట్ చేశారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మా తల్లికి మల్లె పూల దండ గేయంతో ప్రారంభమైన కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముందుగా అన్న ఎన్టీఆర్ గారితో కలిసి 1983 నుంచి పార్టీకి సేవలందించిన సీనియర్ కార్యకర్తలు మరియు నాయకులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని పాత నాయకులు మరియు కొత్తగా పదవులు స్వీకరించిన మండల అధ్యక్షులను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఘనంగా సన్మానించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న గ్రామ, మండల, మరియు అనుబంధ కమిటీలలో వివిధ పదవులు పొందిన నాయకులకే టిడిపి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవమే లక్ష్యంగా సమాజ సేవ కోసం అన్న స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి పునాదులు వేశారనన్నారు. నాటి నుంచి నేటి వరకు అంకితభావం కలిగిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమన్నారు. అధినేతకు ఓటరుకు మధ్య కార్యకర్తలే వారధులన్నారు. పదవులనేవి కార్యకర్తల సమర్ధతకు దక్కిన గుర్తింపని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో తెలుగుదేశం పార్టీ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల కోసం పని చేసి భవిషత్తులో నాయకులుగా రాణించాలని ఆమె ఆకాంక్షించారు. మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆత్మీయ ఆశీర్వాదాలతో చంద్రబాబు గారి నాయకత్వంలో యువనేత మంత్రి లోకేష్ గారి ప్రేరణతో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లడంలో కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న నాయకులు కీలకమైన పాత్ర పోషించాలన్నారు. మన అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో యువనేత లోకేష్ గారి సూచనలతో నేను కూడా ఇకపై వారానికి ఒకరోజు పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు వెల్లడించారు. పార్టీలో పదవులు స్వీకరించిన ప్రతి నాయకుడు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ మన పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె స్థానిక నాయకులకు దిశా నిర్దేశం చేశారు. వారానికోరోజు పార్టీ కోసం కేటాయించాలని, గ్రామ పరిధిలో సచివాలయ సిబ్బందితో కలిసి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. గ్రామ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఏవైనా వుంటే నా దృష్టికి తీసుకొని రావాలని కోరారు. మనందరి మార్గదర్శి, విజన్ ఉన్న నాయకుడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యకర్తే అధినేత అన్న యువ నాయకులు మంత్రి లోకేష్ బాబు గారి కార్యాచరణ మనందరికీ ప్రేరణ కావాలని సూచినారు.
బూత్ కన్వీనర్ నుంచి ప్రతి యూనిట్, ప్రతి క్లస్టర్ ఇంచార్జి ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారం చూపడంలో చొరవ చూపాలని కోరారు. పార్టీ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల కోసం పని చేసి భవిషత్తులో నాయకులుగా రాణించాలని ఆమె స్థానిక నాయకులు మరియు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు పుల్లారెడ్డి, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, పెన్నా డెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, జొన్నవాడ ఆలయ ఛైర్మెన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి,బుచ్చిరెడ్డి పాళెం మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, సీనియర్ నాయకులు జివిఎన్ శేఖర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, ఎంపీపీ తుమ్మల పార్వతి, కోవూరు సర్పంచ్ యాకసిరి విజయ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన కొత్త, పాత టిడిపి అధ్యక్షులు టిడిపి గ్రామ, అధ్యక్షులు, యూనిట్, క్లస్టర్, బూత్ కమిటీల కన్వీనర్లు మరియు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.