*తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు – వేమిరెడ్డి దంపతులు*
తెలుగు ప్రజల నూతన వసంతం ఉగాది సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, కోవూరు ప్రజానీకానికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఈ విశ్వావసు సంవత్సరం ప్రతి ఇంట ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలకు అన్నీ శుభాలే జరగాలని, ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, దేవుడి దీవెనలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారాలోకేష్ గార్ల సారధ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, ప్రజల జీవితాలు కళకళలాడాలని వారు ఆకాంక్షించారు.