*తెలుగు జాతి గర్వపడేలా మహానాడు నిర్వహణ*
*కడపలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన సమన్వయ కమిటీ సభ్యులు, ఎంపీ వేమిరెడ్డి
*ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచన*
*చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును నిర్వహించాలి : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*
– పరిశీలనలో పాల్గొన్న కడప టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి తదితరులు
చరిత్రలో నిలిచిపోయేలా కడపలో మహానాడును నిర్వహించుకోవాలని మహానాడు సమన్వయ కమిటీ సభ్యులు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం కడపలో మహానాడు నిర్వహించనున్న ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. ఎంపీ వేమిరెడ్డి తో కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను వేమిరెడ్డి పరిశీలించారు. ఇప్పటివరకు చేసిన పనులపై అడిగి తెలుసుకున్నారు. భారీగా తరలిరానున్న నాయకులు, కార్యకర్తల వసతులకు సంబంధించి ఆరా తీశారు. అనంతరం ఆయన పలు సూచనలు చేశారు. ఎంపీ వేమిరెడ్డితో టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, రవీంద్ర రెడ్డి తదితరులు ఉన్నారు.