*తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది*

– పార్లపల్లి వరద బాధిత పునరావాస కేంద్రంలో బాదితులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

మొంథా తుపాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తెలిపారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తుఫాను బాధితుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.

ఈ పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న పార్లపల్లి కి చెందిన 120 మందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పరామర్శించారు. వారి యోగా క్షేమాలు తెలుసుకున్నారు. ఆహార పొట్లాలు, మరియు దుప్పట్లు పంపిణి చేశారు.

విడవలూరు మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 7 పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసతి, భోజనం తదితర ఏర్పాట్లలో ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.

వరద బాధితులు తలదాచుకుంటున్న పునరావాస కేంద్ర పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని, అలాగే వారికి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినా డాక్టర్లు తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ, విద్యుత్ మరియు ఆరోగ్య శాఖ అధికారులతో పాటు టిడిపి మండల అధ్యక్షులు శ్రీహరి రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, పాశం శ్రీహరి రెడ్డి స్థానిక నాయకులు ఏసోబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed