
*తాగునీటి సరఫరా పైప్ లైన్ లీకేజీలను గమనించి వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక నారాయణ కళాశాల సమీపంలో బలిజ పాలెం ప్రాంతంలో పర్యటించారు.
పర్యటనలో భాగంగా డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో తాగునీటి సరఫరా పైప్ లైన్ లీకేజీలను కమిషనర్ గమనించి వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు.
స్థానికంగా నిర్మాణం అవుతున్న నూతన భవనాలకు అనుమతులను పరిశీలించి అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేశారు. భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు తప్పనిసరి అని, ప్రతి ఒక్కరు అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. భవన నిర్మాణ సమయంలో ప్లాన్ అనుమతులను బహిరంగంగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.