ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ వేమిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామిగా కూటమి తరఫున నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలసి.. ఢిల్లీలోని షహదరా ప్రాంతంలోని డీటీయూ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో తెలుగు ప్రజలు భారీ స్థాయిలో నివాసం ఉండటం విశేషం. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీలతో కలిసి ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులతో ముచ్చటించి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారు. ఇతర ఎంపీలతో కలిసి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి.. ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు.