
*డ్రైన్ కాలువలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను యుద్ధప్రాతిపదికన కమిషనర్ సమక్షంలో తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక ఎస్ 2 థియేటర్ల మార్గం నుంచి రామలింగాపురం అండర్ బ్రిడ్జి వరకు డ్రైన్ కాలువల ద్వారా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహాన్ని అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు.
డ్రైన్ కాలువలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను యుద్ధప్రాతిపదికన తొలగించి డ్రైన్ కాలువ ప్రవాహాన్ని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించి, అక్రమ నిర్మాణాల తొలగింపు పనులను కమిషనర్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
అనంతరం స్థానిక సండే మార్కెట్ ప్రాంతంలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలో రోడ్లపై చేరిన వర్షపు నీరు సాఫీగా డ్రైవ్ కాలువల ద్వారా ప్రవహించేందుకు అవసరమైన ఏర్పాట్లను కమిషనర్ పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ యస్.ఈ. రామ్మోహన్ రావు, నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, సిటీ ప్లానర్ రఘునాధరావు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రహంతు జానీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వేణు, ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.