
*డిసెంబర్ 30 నుండి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు: టిటిడి బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం*
వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
▪️మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తాము.
▪️మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు.
▪️జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తునట్లు చెప్పారు.