డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ఘన నివాళి

నెల్లూరు నగరంలోని,ముత్తుకూరు బస్టాండ్ నుండి వి ఆర్ సి సెంటర్ వరకు సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా , రాజ్యాంగ గౌరవ ర్యాలీ నిర్వహించి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శిపారెడ్డి వంశీధర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ రద్దు చేస్తుందని చెప్పడం పూర్తిగా అవాస్తవం. బీజేపీ ప్రభుత్వ హయాంలో కేవలం 15 సార్లు మాత్రమే రాజ్యాంగ సవరణ జరిగింది. కానీ కాంగ్రెస్ హయాంలో ఎన్నో మార్లు రాజ్యాంగాన్ని సవరిస్తూ, దుర్వినియోగం చేశారు. అంబేద్కర్ గారిని వారసులమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు గతంలో ఆయనను రెండు సార్లు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు.”

అంబేద్కర్ గారి ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకాలు కావాలని, “మనకు ఓటు హక్కు, సమాన విద్యావకాశాలు, కుల మతాలకు అతీతంగా సమానత్వం ఇవన్నీ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లే సాధ్యమయ్యాయి. ఆయన మహోన్నత వ్యక్తిత్వం నేటి తరాలకి స్ఫూర్తి” అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయుడు, ప్రధాన కార్యదర్శి నరేష్, నవీన్, ఓబీసీ మోర్చా జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్ ఎస్ టి మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రసాద్, మండల అధ్యక్షులు,మింగా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *