
*టిటిడి ఛైర్మన్ బి.ఆర్ నాయుడు దంపతులకు వేమిరెడ్డి దంపతుల ఆత్మీయ స్వాగతం*
నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో టివి5, హిందూధర్మం ఛానళ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ శివ పార్వతుల కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు విచ్చేసిన టిటిడి ఛైర్మన్ బి.ఆర్ నాయుడు గారిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు.
విపిఆర్ గారి ఆహ్వానం మేరకు నగరంలోని ఆయన ఇంటికి వచ్చిన బి.ఆర్ నాయుడు దంపతులకు ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు.