
*టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు రాజీనామా చేయాలని .. వైసిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైసిపి మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత గార్లతో కలిసి వెంకటేశ్వర స్వామికి..పూజా కార్యక్రమాలు నిర్వహించిన..*
*ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
నెల్లూరు మాగుంట లేఔట్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో *తిరుమల పవిత్రతను.. కాపాడాలని కోరుతూ.. తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణమే టిటిడి చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి.*
ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు *వరుదు కళ్యాణి* గారు, వైసిపి మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ *కాకాణి పూజిత* గారు హాజరై.. స్వామివారికి పూజలు నిర్వహించారు.
*అనంతరం ఆలయం బయట.. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా బి ఆర్ నాయుడు.. వ్యవహరిస్తున్న తీరుపై వైయస్ఆర్సీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.*
*బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు.*
*కాకాణి పూజిత గారి కామెంట్స్*
• తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ..ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాము.
• బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి.. తిరుమలలో భక్తుల మనోభావాలకు విరుద్ధంగా అనేక అపచారాలు చోటు చేసుకుంటున్నాయి.
• ఇందుకు బి ఆర్ నాయుడు వ్యవహార శైలే కారణం.
• ఇంత జరుగుతున్న బిఆర్ నాయుడును.. చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించకపోవడం.. భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే.
*ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్.*
• బిఆర్ నాయుడు వ్యవహార శైలితో.. ఆయన ఎంత కళంకితమైన వ్యక్తి అని ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది.
• గతంలోనే బిఆర్ నాయుడు పై.. ఇందులేఖ గారు చంద్రబాబు నాయుడు కి లెటర్ రాయడం.. అతని క్యారెక్టర్ బయటపెట్టడం జరిగిందన్నారు.
• ఈరోజు అవన్నీ లెక్కచేయకుండా చంద్రబాబు నాయుడు.. కళంకితమైన బిఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ పదవిని అప్పగించడం.. దుర్మార్గం.
• బి ఆర్ నాయుడు కు సంబంధించి అసభ్యకరమైన వీడియోలు బయటికి వచ్చినప్పటికీ.. చంద్రబాబు నాయుడు ఆయన్ని టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే.
• హిందువుల మనోభావాలతో .. పనిలేదు అన్న విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు .
• తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ.. నైతిక విలువలు లేని బి.ఆర్ నాయుడు ను ఇంకా ఎందుకు టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తున్నారో..చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి .
• రోజు బిఆర్ నాయుడు తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టైనా లేదు.
• పైగా బిఆర్ నాయుడు ను చంద్రబాబు నాయుడు.. వెంటబెట్టుకొని వారి మనవడు దేవాన్ష్ పుట్టినరోజున అన్నదాన కార్యక్రమం.. ఒంటిమిట్ట రామాలయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం.. దురదృష్టకరమన్నారు.
• ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు..బిఆర్ నాయుడు వెంటనే టిటిడి చైర్మన్ పదవి నుంచి తొలగించి.. తిరుమల పవిత్రతను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.
*ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి కామెంట్స్.*
• బి ఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ .. అయినప్పటి నుంచి తిరుమల కొండపై అనేక అపచారాలు చోటు చేసుకున్నాయి.
• ఈరోజు బిఆర్ నాయుడు వ్యవహార శైలితో .. ప్రజలందరూ సిగ్గుపడుటమే కాకుండా సభ్య సమాజం తలదించుకుందన్నారు.
• అలాగే తిరుమల లడ్డు విషయంలో వైఎస్ఆర్ సీపీని ఇరుకున పెట్టే విధంగా.. తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న.. తీరును .. ఆ పార్టీ చేస్తున్న కుట్రలను అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిందన్నారు.
• ఈ ఆర్థిక కుట్రలో భాగంగా తిరుమల పవిత్రతను చంద్రబాబు నాయుడు రోడ్డు మీదకు తీసుకొచ్చి… హిందువుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు.
• వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో.. తిరుమలలో వైఎస్ఆర్ సీపీకి సంబంధించిన వ్యక్తిపై చిన్న ఆరోపణ వచ్చిన వెంటనే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తిని తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందన్నారు.
• వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు..భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏం జరిగిన ఉపేక్షించరని తెలిపారు.
• ఈరోజు బిఆర్ నాయుడు పై వీడియోలు బయటకు రావడం ఆయన తీరు పై.. ప్రజలందరూ మండిపడుతున్నప్పటికీ .. చంద్రబాబు నాయుడు బి ఆర్ నాయుడు ఆయన్ను చైర్మన్ పదవి నుంచి తొలగించకపోవడం.. సిగ్గుచేటు అన్నారు.
• ఇటీవల కాలంలో బిఆర్ నాయుడు.. ప్రజలను రెచ్చగొట్టేలాగా నేనింతే ఇలాగే ఉంటాను మీరేం చేసుకుంటారో చేసుకోండని .. తిరుమలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
• ఇలా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బి.ఆర్ నాయుడు ను.. టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
• కావాలంటే చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడును టిడిపి పార్టీ అధ్యక్షులుగా, లేదంటే తమ మంత్రివర్గంలో మంత్రిగా పదవి ఇచ్చిన తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
• కానీ తిరుమల తిరుపతి లాంటి పవిత్రమైన దేవస్థానం కు ఆయన చైర్మన్ గా కొనసాగిస్తానంటే.. ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
• కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న బిఆర్ నాయుడు ను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూజలు చేయడం జరిగిందన్నారు.
• ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని.. లేదంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తుందన్నారు.