SPS నెల్లూరు జిల్లా,

*జిల్లాలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలకు పలు సూచనలు చేసిన గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి,IPS., , జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,.*

 జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయుటకు ప్రతి బృందానికి ఒక SI స్థాయి అధికారి ఇంచార్జ్ గా ఉంటూ 6 స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసారు.
 జిల్లా పోలీసు వ్యవస్థను మరింత చురుకుగా, సమయస్పూర్తితో, సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళాలని తెలిపారు.
 ప్రతి బృందం నిర్దిష్ట ప్రాంతాల్లో, నిర్దిష్ట నేర రకాలపై ఫోకస్ పెట్టి పనిచేయాలి.
 నేరాలు జరుగుటకు అవకాశం ఉన్న సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ సడెన్ రైడ్స్ నిర్వహించాలి.
 రాత్రిపూట పహారా, పాయింట్ చెకింగ్, మొబైల్ పార్టీల గస్తీ పెంచాలని సూచించారు.
 గాంజా అమ్మకం, వినియోగం, రవాణాపై జిల్లా వ్యాప్తంగా అత్యంత కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
 వీకెండ్స్, ఫెస్టివల్ డేస్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ప్రమాదాలను ముందస్తుగా అరికట్టాలి.
 క్రిమినల్స్ ఉన్న ప్రదేశాలు, అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లు పద్ధతి ప్రకారం నిర్వహించాలి.
 అక్రమ కార్యకలాపాలకు వేదికగా ఉపయోగిస్తున్న లాడ్జీలు, లాడ్జ్ బుకింగ్ రికార్డ్స్‌పై తనిఖీలు చేయాలి.
 ఫీల్డ్‌లో ఉన్న స్టాఫ్ ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండేలా సూచించారు.
 నేరాలను అరికట్టడమే కాకుండా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.10.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed