జిల్లా కలెక్టర్ ఆనంద్ ని కలిసి.. జాఫర్ సాహెబ్ కెనాల్ వద్ద షాపులు ఏర్పాటు వలన వచ్చే ఇబ్బందుల పై ….వినతి పత్రం అందజేసిన *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
—————————————-
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్ గారిని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు  జిల్లా కలెక్టర్ ఆనంద్ గారిని కలిసి.. జాఫర్ సాహెబ్ కెనాల్  వద్ద  షాపుల ఏర్పాటులో ఉన్న సాంకేతిక, న్యాయ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.

*గత ప్రభుత్వంలో అక్కడ సువిశాలమైన రోడ్డును ఏర్పాటు చేసి.. జాఫర్ సాహెబ్ కెనాల్..పక్కన గ్రీనరీ, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారని చంద్రశేఖర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి తెలియజేశారు.*

ఆ ప్రాంతంలో *దుకాణాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బంది కలగడంతో పాటు.. ట్రాఫిక్ జాం ఏర్పడి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని.. అంతేకాకుండా.. ఆ రోడ్డు కుండా ప్రయాణించే మహిళలకు కొంత అసౌకర్యంగా మారే అవకాశం ఉందని కలెక్టర్ గారికి వివరించారు.*

*తక్షణమే ఆ ప్రాంతంలో గ్రీనరీ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కలెక్టర్ గారిని  కోరారు.*

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ గారు, వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి నేతాజీ సుబ్బారెడ్డి గారు, వైఎస్ఆర్సిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు సిద్ధిక్ గారు, కార్పొరేటర్ కరిముల్లా  గారు, మాజీ ఏ యం సి చైర్మన్ పెర్నెటి కోటేశ్వర రెడ్డి, కార్పొరేటర్ వేలూరు ఉమా మహేష్ గారు,జిల్లా యువజన అధ్యక్షులు మరియు 13 డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున గారు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *