*జనరంజికమైన మేనిఫెస్టో…..విలువలతో కూడిన మేనిఫెస్టో : ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి*

 

*చేయగలిగేది చెబుతాడు జగన్*

*జిల్లాలో లోప్రజాసేవ చేసే వారే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు..*

జిల్లాలో టీడీపీ డబ్బు సంచులు ఇచ్చిన వారికే సీట్లు ఇచ్చింది…

*నగరంలో విజయసాయి రెడ్డికి,ఖలీల్* *అహ్మద్* *కు*
*విశేష* *ప్రజాదరణ……*

*జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలువలతో కూడిన జన రంజికమైన మేనిఫెస్టోను విడుదల చేశారని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు…
శనివారం నగరంలోని మాగుంట లేఔట్ లో గల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు..
తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ప్రజాసేవ చేసే వారిని అభ్యర్థులుగా నిలిపారన్నారు..
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో డబ్బు సంచులి ఇచ్చిన వారికే సీట్లు ఇచ్చారన్నారు..

నగరంలో పొంగూరు నారాయణ నాలుగున్నర సంవత్సరం అడ్రస్ లేడని …తనకోసం కష్టపడ్డ వారికి నాలుగున్న రెళ్ళు గా కనపడలేదన్నారు.
తెలుగుదేశం వారు కేవలం డబ్బుంటే చాలు ప్రజల నుండి గౌరవం వస్తుందని అహంకారంతో ఉన్నారన్నారు..

జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థి విజయ సాయి రెడ్డికి నగరంలో ఖలీల్ అహ్మద్ కు విశేష ప్రజాదరణ లభిస్తోందన్నారు.

పార్ట్ టైం నాయకుడైన పొంగూరు నారాయణకు నగర ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయగలిగేదే చెబుతాడని అన్నారు..
చంద్రబాబు నాయుడు రాష్ట్రం మరో శ్రీలంక నైజీరియా అవుతుదన్నాడు..

కానీ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సుభిక్షంగా పాలన అందించి అన్ని సంక్షేమ పథకాలు పేదలకు అవినీతికి తావు లేకుండా అందించి ,ఉద్యోగ ఉపాధి కల్పించారు అన్నారు…
కేవలం చంద్రబాబు తన పాలల్లో 34,000 ఉద్యోగాలు ఇస్తే తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 4,40,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనుడన్నారు..
దేశంలో ఏ సీఎం చేయలేని విధంగా ఉద్యోగ కల్పన కల్పించాడన్నారు..
ఉద్యోగాలు ఇవ్వలేదని కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు..
70 వేల కోట్లు సంక్షేమ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడుతుంటే 1,25,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఖర్చు పెడతాం అంటున్నాడు.. కానీ ప్రజలు నమ్మే విధంగా లేరు అన్నారు..
తమ నాయకుడు ఇచ్చిన హామీల లో స్పష్టత ఉంటుందని, చంద్రబాబు నాయుడు హామీల్లో ఉండదనీ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.
చంద్రబాబు పిచ్చి మాటలు ప్రగల్పాలు ప్రజలు నమ్మేలా లేరన్నారు..
పొంగూరు నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు అభివృద్ధి విషయం లో నిరూపిస్తే ఎమ్మెల్సీ రాజీనామా చేస్తానని గతంలో చెప్పానన్నారు…
రాజకీయాల్లో పొంగూరు నారాయణ నీ నమ్మిన వారికి అండగా ఉంటానని చెప్పగలరా అని ప్రశ్నించారు…
చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తే నారాయణ నెల్లూరుని అప్పులు పాలు చేశాడన్నారు..
తాము పవిత్ర గ్రంథంగా భావిస్థామన్నారు..
జిల్లాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ *క్లీన్ స్వీప్* చేయడం ఖాయమన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed