*చెంగాళమ్మ ఆలయానికి వేమిరెడ్డి దంపతుల భారీ విరాళం*

– నిత్యాన్నదానానికి 6 లక్షలు అందజేత.
– అమ్మవారి ఆలయంలో ఛండీయాగం నిర్వహణ
– ప్రజలందరిపై అమ్మవారి ఆశీసులు మెండుగా ఉండాలి

దైవ కార్యక్రమాలకు తనవంతు అండగా నిలిచే నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. శనివారం సూళ్ళురుపేటలో కొలువై ఉన్న చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్న వారు.. అమ్మవారి ఆశీసులు అందుకున్నారు. ఆలయంలో చేపట్టిన ఛండీయాగంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నిత్యాన్నదానానికి రూ.6 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు చెక్కును ఆలయ సహాయ కార్యదర్శి ప్రసన్న లక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ శాలువాతో సన్మానించారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంతమ్మ మాట్లాడుతూ.. ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో చండీ యాగం నిర్వహించామన్నారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీసులు అందుకున్నామన్నారు. అలాగే అన్నదానానికి 6 లక్షలు అందజేశామని తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు, జిల్లా, కోవూరు ప్రజలకు అమ్మవారి ఆశీసులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed