చనిపోయిన డ్రైవర్ భార్యకు ఉద్యోగం ఇవ్వండి

ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనలతో

మునిసిపల్ కమిషనర్ సూర్య తేజ గారికి జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ వినతి
————-
కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైవరుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం మృతి చెందడం బాధాకరమని జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జునయాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కమిషనర్ సూర్య తేజ గారి ని కలిసి సుబ్రమణ్యం భార్యకు ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం విషయంలో కమిషనర్ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తెలిపారు. ఈ విషయం పై కమిషనర్ స్పందించి తగిన సాయం చేస్తాము అన్నారు,ఈ కార్యక్రమంలో సుందరామి రెడ్డి, అనుదీప్,ఖరీం, మనోజ్,జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed