*ఘనంగా వి.ఎస్.యూ సంస్థాపన దినోత్సవం…*
…………………..
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోసంస్థాపన దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ పురోగతిపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. విశిష్ట అతిథిగా నెల్లూరు మునిసిపల్ కమిషనర్ శ్రీ నందన్, I.A.S. పాల్గొన్నారు.
ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ –
“విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం 2008 జూన్లో స్థాపించబడింది. అప్పటి నుండి అనేక రంగాల్లో విశ్వవిద్యాలయం విశేష పురోగతి సాధించింది. విద్య, పరిశోధన, సామాజిక బాధ్యత వంటి అంశాల్లో మేము నిరంతరం అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నాం.”
“ఈ విశ్వవిద్యాలయ స్థాపన నుండి అభివృద్ధి దిశగా ఎంతో కృషి చేసిన పూర్వ ఉపకులపతుల సేవలను మేము మరువలేం. వారు వేసిన బలమైన పునాది మీదే ఈ రోజు వి.ఎస్.యు నిలబడి ఉంది. అలాగే పూర్వ రిజిస్ట్రార్లూ విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం సుదీర్ఘకాలంగా అంకితభావంతో సేవలందించారు. వారి అందరి సేవలకు మనం గౌరవంతో కృతజ్ఞతలు తెలపాలి.”
కమిషనర్ శ్రీ నందన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు –
“విశ్వవిద్యాలయ అభివృద్ధికి నగర పాలక సంస్థ తరఫున అన్ని విధాలుగా మద్దతు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సమాజానికి అవసరమైన నైతిక విలువలు బోధించే దిశగా విశ్వవిద్యాలయం ముందడుగు వేయాలి.”
రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు మాట్లాడుతూ –
“విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్వతంత్రంగా ఎదుగుతూ, విద్యా మరియు పరిశోధనా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి సంవత్సరం ఫౌండేషన్ డేను ఘనంగా నిర్వహించడం విశ్వవిద్యాలయ అభివృద్ధికి సూచికగా నిలుస్తోంది. ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఎంతో మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో విశిష్ట స్థానం పొందడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతంగా నిర్వహించారు.