
*గోళ్లవారిపల్లె బాధిత కుటుంబానికి అండగా ఎంపీ విపిఆర్*
– 5 లక్షల చెక్కు అందజేసిన విపిఆర్ సిబ్బంది
– కర్నూలు బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి అండగా ఉంటానని నాడు హామీ ఇచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
– ఇచ్చిన మాట మేరకు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా
కర్నూలు రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన వింజమూరు మండలం గోళ్లవారిపల్లెకు చెందిన గోళ్ల రమేష్ కుటుంబ సభ్యులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్థిక భరోసా అందించారు. బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేశారు. ఈ మేరకు విపిఆర్ సిబ్బంది శంకర్, రమేష్ తదితరులు రమేష్ కుటుంబాన్ని కలిసి చెక్కును అందించారు. ఇటీవల ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించే సమయంలో తన తరఫున 5 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు మంగళవారం మృతుడు రమేష్ తండ్రి మాలకొండయ్య, తల్లి సుశీలకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి మనోధైర్యం అందించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాధిత కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటారని వారు తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తప్పకుండా సహాయం చేసేందుకు ముందుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులు కొండా మహేశ్వర రావు మాట్లాడుతూ ఇచ్చిన మాట మేరకు తమ కుటుంబానికి అండగా నిలబడిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి గారి మద్దతు ఎప్పుడు ఇలాగే ఉండాలని వారు కోరారు.