*క్రీడా గాయాలకు మెడికవర్ లో ఆధునిక చికిత్సలు : సద్వినియోగం చేసుకోవాలని సూచించిన వైద్యులు*
నెల్లూరు (జన హుషార్) మార్చి, 24 : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలిలో రోడ్డు ప్రమాదాలు, జిమ్ వ్యాయామాలు మరియు క్రీడల సమయంలో తలెత్తుతున్న గాయాల కారణంగా భుజం (Shoulder),మోకాళ్ళ (Elbow) సంబంధిత సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు తెలిపారు. ఈ సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ‘షోల్డర్ ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్’ ప్రత్యేక సమావేశంలో డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎం.వి. సుధాకర్ పలు కీలక అంశాలను వెల్లడించారు. సాధారణంగా బైక్ పై నుంచి జారిపడటం, క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో పాల్గొనడం లేదా జిమ్లో సరైన పర్యవేక్షణ లేకుండా అధిక బరువులు ఎత్తడం వంటి సందర్భాల్లో భుజం మరియు మోచేతి, మోకాళ్ళ పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ముఖ్యంగా కింది సమస్యలు తలెత్తుతున్నాయి.
రోటేటర్ కఫ్ టియర్లు: భుజం కీలును పట్టి ఉంచే కండరాలు చిరిగిపోవడం.
లిగమెంట్ డ్యామేజ్: కీళ్ల మధ్య ఉండే బంధనాలు దెబ్బతినడం వల్ల కీలు పట్టు కోల్పోవడం.
షోల్డర్ డిస్లోకేషన్: భుజం కీలు తన స్థానం నుంచి పక్కకు జరగడం.
టెన్నిస్ ఎల్బో: మోచేతి కండరాల వాపు వల్ల వచ్చే తీవ్రమైన నొప్పి.
దీనిపై డాక్టర్ ఎం.సి. వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, భుజం మరియు మోచేతి గాయాల పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను, ఆధునిక చికిత్సా విధానాలను సుదీర్ఘంగా వివరించారు. “సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా క్రీడల్లో గాయపడినప్పుడు చాలామంది బాహ్యంగా కనిపించే గాయాలకు మాత్రమే చికిత్స తీసుకుంటారు. కానీ, భుజం లోపల ఉండే లిగమెంట్ టియర్ (Ligament Tear) లేదా రోటేటర్ కఫ్ డ్యామేజ్ (Rotator Cuff Damage) వంటి అంతర్గత సమస్యలను గుర్తించడంలో విఫలమవుతుంటారు. భుజం నొప్పిని కేవలం సాధారణ నొప్పులుగా భావించి పెయిన్ కిల్లర్లతో కాలం వెళ్లదీయడం వల్ల, భవిష్యత్తులో ఆ కీలు పూర్తిగా బిగుసుకుపోయే (Frozen Shoulder) ప్రమాదం ఉంది అన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఆర్థ్రోస్కోపీ (Arthroscopy) విధానం ఒక వరమని చెప్పవచ్చు. దీనినే ‘కీ-హోల్ సర్జరీ’ అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో పెద్ద కోతలు లేకుండా, కేవలం చిన్న రంధ్రాల ద్వారా కెమెరాను పంపి లోపల ఉన్న సమస్యను ఖచ్చితంగా గుర్తించి చికిత్స చేస్తాము.
దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు…
తక్కువ రక్తస్రావం: సాంప్రదాయ సర్జరీలతో పోలిస్తే ఇందులో కోతలు చాలా చిన్నవిగా ఉంటాయి.
వేగంగా కోలుకోవడం: రోగి సర్జరీ జరిగిన అతి తక్కువ సమయంలోనే డిశ్చార్జ్ అయ్యి, తమ దైనందిన పనులకు తిరిగి వెళ్లవచ్చు.
తక్కువ నొప్పి: కండరాలను కత్తిరించాల్సిన అవసరం ఉండదు కాబట్టి నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే లేదా భుజంలో కదలి.
యువతలో పెరుగుతున్న సమస్యలు – డాక్టర్ ఎం.వి. సుధాకర్ మాట్లాడుతూ “నేటి యువత ఫిట్నెస్ పట్ల ఆసక్తితో జిమ్ మరియు క్రీడల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవడం వల్ల ‘టెన్నిస్ ఎల్బో’ మరియు భుజం గాయాల బారిన పడుతున్నారు. నొప్పి ప్రారంభమైన తొలి దశలోనే వైద్యులను సంప్రదిస్తే ఫిజియోథెరపీ లేదా మందులతో నయం చేయవచ్చు. సమస్య తీవ్రమైతే ఆర్థ్రోస్కోపీ వంటి శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. అధునిక వైద్య పరిజ్ఞానంతో తక్కువ కోతతోనే చికిత్స అందించే సౌలభ్యం మెడికవర్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉంది.” అని వెల్లడించారు. ఏదైనా గాయం జరిగినప్పుడు వెంటనే నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్లను సంప్రదించి, అవసరమైన ఎక్స్-రే లేదా ఎంఆర్ఐ (MRI) స్కాన్ల ద్వారా సమస్యను గుర్తించడం ఎంతో అవసరమని వైద్య బృందం సూచించింది. సరైన సమయంలో స్పందిస్తే సంక్లిష్ట శస్త్రచికిత్సల అవసరం లేకుండానే పూర్తిస్థాయిలో కోలుకోవచ్చని స్పష్టం చేశారు. ఇలాంటి అన్నీ సమస్యలకు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో పూర్తి స్థాయి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.