*SPSR నెల్లూరు జిల్లా*

*కోవూరు పరిధిలో జరిగిన పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.25,000/- జరిమానా విధింపు*

 *గుడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ ను బలోపేతం చేస్తూ, నెల్లూరు జిల్లా యస్.పి. డా. శ్రీమతి అజిత వేజెండ్ల,IPS., గారు, నేరస్థులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు.*
 *కోవూరు పరిధిలో నమోదు అయిన పోక్సో కేసులో, గౌరవ నెల్లూరు పోక్సో కోర్టు జడ్జి గారు ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.25,000/- జరిమానా విధించారు.*
 *మహిళలు, చిన్నారులపై దౌర్జన్యాలు లేదా లైంగిక నేరాలకు పాల్పడిన వారు తప్పనిసరిగా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.*
 *జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, నెల్లూరు పోలీసులు బాధితులకు న్యాయం జరిగేలా పటిష్టమైన సాక్ష్యాలను సేకరించి, నేరస్థులకు శిక్షలు పడే విధంగా చేస్తున్నారు.*
 *జిల్లా పోలీసుల కృషి వల్ల ఇప్పటికే అనేక కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడుతున్నాయి.*

*కేసు వివరాలు:* కోవూరు పరిధిలో 21.04.2021 న బాలిక చేయిపట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి, మైనర్ బాలికను బలవంతంగా అత్యాచారం చేయడానికి ముద్దాయి ప్రయత్నించాడని, ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడింది.
*కేసు నంబర్:* Cr. No:- 98/2021 u/s 376 IPC and sec. 3(a) r/w 4 of POCSO act 2012 Altered to 376-AB IPC and sec. 5(m) r/w 6 of POCSO act 2012 of మహిళా పోలీస్ స్టేషన్.
 *అప్పటి మహిళా పోలీస్ స్టేషన్ DSP శ్రీ U. నాగరాజు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, చార్జ్ షీట్ దాఖలు చేయడంతో, ప్రాసిక్యూషన్ వారు నేరాన్ని రుజువు చేశారు.*
 *విచారణ అనంతరం గౌరవ నెల్లూరు పోక్సో కోర్టు జడ్జి శ్రీమతి సిరిపిరెడ్డి సుమ గారు నేడు ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.25,000/- జరిమానా విధించారు.*
*ముద్దాయి వివరాలు:* రాయదుర్గం వెంకటేశ్వర్లు s/o బలరామయ్య, సం.66 yrs, జంగం, పాటూరు గ్రామం, కోవూరు మండలం, నెల్లూరు.
*అభినందనలు:* ఈ కేసులో సమర్థవంతంగా వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ దూబిశెట్టి చంద్రశేఖర్ గారిని, కేసు దర్యాప్తు చేసిన విచారణ అధికారి అప్పటి మహిళా పోలీస్ స్టేషన్ DSP శ్రీ U. నాగరాజు గారిని, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఎస్సై శ్రీ కె. సుమన్ గారిని, పోక్సో కోర్ట్ లైజన్ ఆఫీసర్ శ్రీ ఎం.ఏ. బాదుషా గారిని, సాక్షులను కోర్టులో హాజరుపరచడంలో సహకరించిన ASI-1705, ఇ. కోటేశ్వరరావు గారిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.

జిల్లా పోలీసు కార్యాలయం, నెల్లూరు – తేదీ 09.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *