
*కోవూరు నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి నిధులు కేటాయించండి*
*కోవూరు నియోజకవర్గంలో మినీ స్టేడియంలు, ఆట స్థలాలు నిర్మించి క్రీడా అభివృద్ధికి సహకరించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి*
– విడవలూరులోని ఎన్.టి.ఆర్ క్రీడా వికాస కేంద్ర నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేయండి.
– కొడవలూరులోని గిరిజన గురుకుల పాఠశాలలో స్టేడియం మరియు ఆటస్థలాల నిర్మాణం నేటికీ అసంపూర్తిగానే వున్నాయి.
– ఇందుకూరుపేట మండల కేంద్రంలోని ఎం.కె.ఆర్ హైస్కూల్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి 4 కోట్లు కేటాయించండి.
– గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా రంగ మౌలిక సదుపాయాలు కల్పించండి.
– క్రీడాశాఖ మంత్రి మందిపల్లి రాం ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వినతి.
– సానుకూలంగా స్పందించిన క్రీడాశాఖ మంత్రి క్రీడా రంగ అభివృద్ధికి హమి.
కోవూరు నియోజకవర్గంలో మినీ స్టేడియంలు, ఆట స్థలాలు నిర్మించి క్రీడా అభివృద్ధికి సహకరించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని మంత్రి కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసి కోవూరు నియోజకవర్గంలో క్రీడా రంగ పురోగతి మరియు క్రీడాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యకలాపాల గురించి చర్చించారు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో మంజూరై అసంపూర్తిగా వున్న విడవలూరులో 50 లక్షలతో చేపట్టిన ఎన్.టి.ఆర్ క్రీడా వికాస కేంద్రం మరియు 20 లక్షలతో కొడవలూరులోని గిరిజన గురుకుల పాఠశాలలో స్టేడియం, ఆట స్థలాల నిర్మాణంలో జరుతున్న జాప్యాన్ని ఆమె మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఇందుకూరుపేట మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణం నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా ఈ ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు వినతిపత్రం అందజేశారు. ఇందుకూరు పేట మండల కేంద్రంలోని ఎం.కె.ఆర్ హైస్కూల్ ప్రాంగణంలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి అనువైన 5.70 ఎకరాల భూమి అందుబాటులో ఉందని ఆమె మంత్రికి వివరించారు. ఇందుకూరు పేట మండల కేంద్రం అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలను కలిగి ఉండటమే కాకుండా, ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో క్రీడాభిలాషులైన యువతను . ఈ ప్రాంతంలో ప్రతిభావంతులైన యువకులు ఉన్నప్పటికీ, వారికి సరైన క్రీడా మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఇందుకూరుపేట మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ మరియు తీరప్రాంత యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనడానికి మరియు శారీరక దృఢత్వాన్ని పెంపొందించు కోవడానికి ఎంతో దోహద పడుతుందన్నారు.
ఇక్కడ 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ తో పాటు బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, ఖో-ఖో, కబడ్డీ తదితర క్రీడల కోసం ప్రత్యేక కోర్టులు మరియు ఆటస్థలాలతో కూడిన ఒక సమగ్ర క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 4 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రణాళిక మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి అందజేశారు. తన ప్రతిపాదనను పరిశీలించి, గ్రామీణ మరియు తీరప్రాంత యువతలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడానికి మరియు వారిలోని ప్రతిభను వెలికితీయడానికి సహకారం అందించాలని కోరారు. ఇందుకూరుపేట ఎం.కె.ఆర్. హైస్కూల్ ఆవరణలో ఈ క్రీడా ప్రాంగణ నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసి కోవూరు నియోజకవర్గ క్రీడాభివృయిద్ది తోడ్పడాలని కోరారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారితో పాటు పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు వున్నారు.