*కోవూరు గడ్డ తెలుగుదేశం అడ్డా*
– లక్ష సభ్యత్వాలు చేసిన సందర్భంగా విపిఆర్ ఇంట టిడిపి నాయకుల సంబరాలు.
– లక్ష సభ్యత్వాలు కోవూరు టిడిపి చరిత్రలో సరికొత్త రికార్డు.
– నాయకులు, కార్యకర్తల కృషి ఫలితమే లక్ష సభ్యత్వాలు.
– ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యువ నాయకుడు మంత్రి లోకేష్ గారి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో దూసుకుపోతుందన్నారు వేమిరెడ్డి దంపతులు. కోవూరు నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు సాధించిన సందర్భముగా నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లోని వేమిరెడ్డి నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్ల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషి చేయడం వల్లే లక్ష సభ్యత్యాల లక్ష్యాన్ని చేరుకోగలిగామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడుతున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని భరోసా యిచ్చారు.
అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ
2024 అక్టోబర్ 26 నుంచి ఇప్పటి దాకా సొంత పనులు కూడా వదిలి పార్టీ కోసం మీరు పడ్డ కార్యకర్తల కష్టార్జితమే నియోజకవర్గంలో లక్ష మందిని పార్టీ సభ్యులుగా చేర్చుకోగలిగామన్నారు. చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ఇల్లిల్లు తిరిగి ప్రజలకు వివరించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తలకు జరిగే ప్రయోజనాలు చెప్పికష్ట పడ్డ నాయకులు మరియు కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియచేసారు. ఐకమత్యంతో పని చేసి కోవూరు గడ్డ తెలుగుదేశం నేటి కార్యకర్తల్లే రేపటి నాయకులన్న వాస్తవాన్ని గుర్తించి ప్రజలతో మమేకమై పని చేయాలని కోరారు. ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త యిదే స్పూర్తితో ఐకమత్యంగా పనిచేసి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి సారధ్యంలో 2029 లో కూడా అధికారం మనదే ఎలుగెత్తిచాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బుచ్చి, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు కోడవలూరు మండలాలకు చెందిన ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.