*కోవూరు కారు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్ధుల మృతిపై పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దిగ్భ్రాంతి*
—————————————
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..
మృతుల కుటుంబాలను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని కోరారు.