*కేటాయించిన విధులను క్రమశిక్షణతో నిర్వహించాలని, కేటాయించిన విధుల నిర్వహణపై ఉన్నత స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారని గుర్తుంచుకోవాలని హెచ్చరించిన కమిషనర్ వై ఓ నందన్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో భాగంగా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ విధులలో నిర్లక్ష్యం పనికిరాదని, క్రమశిక్షణ అవసరమని సిబ్బందిని మందలించారు. అత్యవసర సేవలు అవసరమైన సందర్భంలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, అలాగే విధుల నిర్వహణలో నిబద్ధత పాటించాలని సూచించారు.

కేటాయించిన విధులను క్రమశిక్షణతో నిర్వహించాలని, కేటాయించిన విధుల నిర్వహణపై ఉన్నత స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

ప్రతి టౌన్ ప్లానింగ్ కార్యదర్శి ప్రతిరోజు ఫీల్డ్ విజిట్ వెరిఫికేషన్ వాళ్ళ వాళ్ళ సచివాలయ పరిధిలో తప్పక నిర్వహించాలని, సరిగా నిర్వహణ అమలు చేయడంలో అధికారులు ఇచ్చిన ఆదేశములు పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కార్యదర్శులను ఉద్దేశించి కమిషనర్ హెచ్చరించారు.

MA&UD డిపార్ట్మెంట్ వారి memo ననుసరించి అందరూ టౌన్ ప్లానింగ్ సిబ్బంది వారి సచివాలయం పరిధిలోని తేదీ 31- 8- 2025 తర్వాత జరుగుతున్న భవన నిర్మాణాలను తనిఖీ చేసి వాటి యొక్క వివరములను అందజేయవలసిందిగాను మరియు కోర్టు కేసులకు చార్జ్ షీట్లను దాఖలు పరచవలసిందిగాను మరియు నక్ష ప్రోగ్రామ్ సంబంధించిన ప్రక్రియలు వేగవంతం చేయవలసిందిగాను సూచించారు.

ఎల్.ఆర్.ఎస్. స్కీమునకు సంబంధించి లేఅవుట్ పాటర్న్లను త్వరగా తయారు చేయాలని సూచించారు. బి.పి.ఎస్. పథకంలో అర్హులు, అనర్హులను గుర్తించి పథకంపై పూర్తిస్థాయిలో వారికి అవగాహన కల్పించాలని, నగరపాలక సంస్థకు చెల్లించవలసిన మొత్తాలను వారిద్వారా వసూలు చేసి పథకాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం సిటీ ప్లానర్ హిమబిందు, డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాథరావు, సూపరింటెండెంట్ నరేంద్ర, ఏ.సి.పి లు, టీ.పీ.బి.వోలు, వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed