*కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ సోమిరెడ్డితోనే సాధ్యం*
*సర్వేపల్లికి జీవితాన్ని అంకితం చేసిన సోమిరెడ్డిని ఆశీర్వదించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సింధు విస్తృత ప్రచారం*
*వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెంలో ప్రజలతో మమేకమవుతూ ప్రచారం కొనసాగించిన డాక్టర్ సోమిరెడ్డి సింధు*
*గ్రావెల్ మాఫియా నుంచి వెంకటాచలం మండలానికి విముక్తి కల్పించగలిగే నాయకుడు సోమిరెడ్డే*
*టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే అమలు చేయబోతున్న పథకాలను వివరిస్తూ సాగిన ప్రచారం*
*ప్రతి నెలా అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ.4 వేలు పింఛన్*
*మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం..ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు*
*ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 బ్యాంకులో జమ*
*తల్లికి వందనం పథకంలో భాగంగా చదువుకునే ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.15 వేలు*
*ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం*
*నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేలు*
*పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పన, మెగా డీఎస్సీ తదితర ఎన్నో హామీలను సాకారం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా సోమిరెడ్డిని, కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వెలగపల్లి వరప్రసాద్ రావును గెలిపించాలని కోరిన డాక్టర్ సింధు*