
*కూటమి ప్రభుత్వంలో విద్యా రంగానికి పెద్దపీట*
- – పల్లిపాడు డైట్ కళాశాల ఎందరో గొప్ప ఉపాధ్యాయులను అందించింది.
– 13 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో జిల్లా విద్యా శిక్షణ సంస్థ భవన నిర్మాణాలకు శంఖుస్థాపన.
– టెక్నాలజి ఎంత పెరిగినా విద్యార్థులను సంస్కార వంతులుగా తీర్చి దిద్దేది ఉపాధ్యాయులే.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల స్థానాన్ని కంప్యూటర్ లాంటి యంత్రాలు ఎన్ని వచ్చినా భర్తీ చేయలేవన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 13 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) లో నూతన భవన నిర్మాణాలకు ఆమె శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు శిక్షణ అందించే జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) కోవూరు నియోజకవర్గంలో ఉండడం గర్వకారణం అన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తలపెట్టిన విద్యా సంస్కరణల నేపథ్యంలో 1990లో నిర్మించిన డైట్ కళాశాల శిథిలావస్థకు చేరిన కారణంగా నేడు పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. పల్లిపాడులోని జిల్లా శిక్షణ సంస్థ ఎందరో గొప్ప ఉపాధ్యాయులను అందించిందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు తెలిపారు.
శంఖుస్థాపన చేసిన నూతన భవనంలో మారిన కాలానికి అనుగుణంగా డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యాధునిక లైబ్రరీ, శిక్షణ పొందే ఉపాధ్యాయులకు డార్ మెట్రిలు, బోధనా సిబ్బందికి స్టాఫ్ క్వార్టర్స్ మరియు విశాలమైన సెమినార్ హాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం సాంకేతికత విద్యార్థుల అరచేతుల్లోకి వచ్చేసిందని ఉపాధ్యాయులు ఇప్పుడు కేవలం పాఠ్యపుస్తకాల బోధనలకే పరిమితం కాకుండా సాంకేతికతను విద్యార్థులు సరైన మార్గంలో ఎలా వాడాలో నేర్పే ’మెంటార్స్’ గా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన గురువులు సమాజానికి మార్గం చూపే దిక్సూచిలా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు నిర్మాణ పనులు పూర్తిచేయాలని కాంటాక్టర్ మరియు ఇంజినీర్లకు సూచించారు. గ్రామీణ వాతావరణంలోప్రకృతి ఒడిలో వున్న పల్లిపాడు ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో పచ్చదనం పెంచడంలో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు.
పల్లిపాడు వద్ద పెన్నానది పొర్లుకట్టలు బలోపేతం చేయాలని స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పెన్నా పొర్లు కట్టల బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డి ఇ ఒ ఆర్ బాలాజీ రావు, సమగ్ర శిక్ష అభియాన్ ఇ ఇ వెంకటరత్నం, సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ రవి, టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, పిఎల్ రావు, MSME డైరెక్టర్ వీరేంద్ర నాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ శ్రీహరికోట విజయలక్ష్మి, చాముండేశ్వరి ఆలయ ఛైర్మెన్ గుండ్ర కృష్ణారెడ్డి, డిస్ట్రిబ్యూటర్ కమిటీ వైస్ ఛైర్మెన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డిలతో పాటు డైట్ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.