*కూటమి ప్రభుత్వ విద్యా విధానాలపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్*
—————————————-
నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

*చంద్రశేఖర్ రెడ్డి గారి కామెంట్స్….*

👉 *గత అయిదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.. విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలకు.. ప్రవేశపెట్టి.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి.. విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు అన్న విషయం ప్రజలందరికీ తెలిసని దీన్ని ప్రజలు ఎవరు కాదనలేరన్నది అక్షర సత్యం అని పేర్కొన్నారు.*

👉 *ఈరోజు కూటమి ప్రభుత్వం.. విద్యా వ్యవస్థలో అన్నింటిని రద్దు చేసుకుంటూ పోతూ.. విద్యార్థులనే కాదు ఉపాధ్యాయులను కూడా ఇబ్బందులు గురిచేస్తుందని ఆరోపించారు.*

👉 *గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 117 జీవో తీసుకువస్తే.. దానిపై టిడిపి నేతలు.. లేనిపోని అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు .*

👉 *కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 117 జీవో రద్దు చేస్తామని చెప్పి ఉపాధ్యాయులకు హామీ ఇచ్చి.. ఈరోజు రద్దు చేస్తున్నట్లు నటించి.. మోడల్ స్కూల్ కాన్సెప్ట్ ను చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నారని అన్నారు.*

👉 *117 జీ ఓ ను రద్దు చేసిన వారు.. పాత విధానంలో.. పాఠశాలలను కొనసాగించకుండా.. ఇలా మోడల్ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.*

👉 *117 జీవో ద్వారా కేవలం 4 వేల ప్రైమరీ స్కూల్స్ మాత్రమే.. హై స్కూల్స్ లో విలీనం అవుతుంటే.. ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన మోడల్ స్కూల్స్ కాన్సెప్ట్ విధానం ద్వారా.. ఈరోజు 22 వేల ప్రైమరీ స్కూల్స్.. మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో విలీనం అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.*

👉 *ఇది సరికాదని .. దీన్ని ప్రజలు ఎవ్వరు.. అంగీకరించరన్న విషయం కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు .*

👉 *ఈ తరహా విధానం అటు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు.. ఇటు విద్యార్థుల చదువులకు ఉన్న అవకాశాలను కూడా తగ్గించడమేనన్నారు.*

👉 *అసలు ఈ రాష్ట్రంలో పూర్తిగా యూపీ స్కూల్స్ ని మూసివేయాలనే విధంగా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.*

👉 *యూపీ స్కూల్స్ లో 6, 7 తరగతులు చదువుతున్న పిల్లలు.. 30 మంది కంటే తక్కువగా ఉంటే.. ఆ స్కూల్స్ కు యూపీ స్కూల్స్ హోదా తీసివేసి .. వాటిని ప్రైమరీ స్కూల్స్ గా మార్చేస్తామని ప్రభుత్వం చెబుతుందని ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా అన్నారు.*

👉 *దీంతో పేద విద్యార్థులు .. సుదూర ప్రాంతాల్లో ఉన్న హై స్కూల్ కి వెళ్లే పరిస్థితి ఉండదని.. దీంతో వారు చదువుకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.*

👉 *ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా హై స్కూల్ ప్లస్ విధానాన్ని రద్దుచేసి.. విద్యార్థులను ఇంటర్ చదువులను దూరం చేస్తున్నారని అన్నారు.*

👉 *గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు.. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు.. ఆ పాఠశాలలోనే ఇంటర్ చదువుకునే విధంగా..290 హై స్కూల్ ప్లస్ పాఠశాలలను తీసుకువచ్చి.. ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు పీజీటీలుగా ప్రమోషన్లు కల్పించి.. మరో 210 హై స్కూల్ ప్లస్ లను.. తీసుకువస్తూ మెరుగైన విద్యా విధానానికి నాంది పలికారని తెలిపారు.*

👉 *ఈ హై స్కూల్ ప్లస్ పాఠశాలలకు..కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను కేటాయించకుండా.. అక్కడ క్వాలిటీ విద్య లేదనే.. భావనతో.. పూర్తిగా 500 ల హైస్కూల్ ప్లస్ పాఠశాలను లను.. రద్దు చేసిందంటే.. విద్యా వ్యవస్థను ఏ విధంగా బ్రస్టు పట్టిస్తుందో ఇట్టే అర్థం అవుతుందన్నారు*

👉 *ఈరోజు గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఎంఈఓ-2, విధానాన్ని రద్దు చేయడం దురదృష్టకరమన్నారు.*

.👉 *గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 70 శాతం మంది కాంటాక్ట్ లెక్చరర్లు ఉంటే అందర్నీ పర్మినెంట్ చేసే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి జీవో తీసుకొస్తే ఈరోజు ఆ జీవో కూడా రద్దు చేసి వారందరూ అదే వ్యవస్థలో కొనసాగే పరిస్థితి తీసుకొచ్చి.. వారి ఆశలను ఒమ్ము చేశారని దుయ్యబట్టారు.*

👉 *గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.. నాడు నేడు విధానం ద్వారా పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చి.. RO మంచినీటి సిస్టం, పరిశుభ్రమైన వాష్ రూమ్స్, ifp ప్యానల్ బోర్డ్స్, byjus tabs, ఇంగ్లీష్ మీడియం విద్య, టోఫెల్ శిక్షణ, IB సిలబస్, CBSE సిస్టం.. తీసుకొస్తే.. వాటన్నింటిని రద్దుచేసి ఈరోజు విద్యా వ్యవస్థను.. నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.*

👉 *అమ్మ ఒడి రద్దు విదేశీ విద్యాదీవెన రద్దు, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు, ఇలా అన్ని రద్దు చేసుకుంటూ పోయి.. ఏం సాధిస్తారని ప్రశ్నించారు.*

👉 *ఇలా చేస్తే ప్రజాగ్రహం తప్పదని.. ప్రజాక్షేత్రంలో ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు..*

👉 *ఇప్పటికైనా.. కూటమి ప్రభుత్వం బుద్ధి మార్చుకొని.. విద్యా వ్యవస్థలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *