
*కూటమి ప్రభుత్వ ప్రధమ వార్షికోత్సవ కానుక “విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు”, “ఇంటి పన్నుల పెంపు”ని వ్యతిరేకించండి…… సీపీఎం*
ఈరోజు (జూన్ 4వతేదీ) ఉదయం 11గంటలకు సీపీఎం జిల్లా ఆఫీస్, బాలాజీ నగర్ లో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా సెక్రటేరియేట్ సభ్యులు, పట్టణ నివాస ప్రాంతాల సమన్వయ కమిటీ కన్వీనర్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ప్రధమ వార్షికోత్సవ కానుకగా పట్టణ ప్రజలపై అదనపు భారాలు మోపుతోందని అన్నారు.
విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించి ప్రీపెయిడ్ మరియు పీక్ అవర్స్ లో అదనపు చార్జీల పేరుతో భారాలు వేస్తోందని అంతే కాకుండా ఇంటి పన్నులు కూడా 20శాతం పెంచేందుకు ఇల్లిల్లూ తిరిగి అన్ అసెస్డ్ , అండర్ అసెస్డ్ పేరుతో సర్వే చేస్తున్నారని అన్నారు.ఈ విధానాన్ని మానుకోవాలని ఇంటి పన్నుల విధింపు గతంలో వున్నట్లు రెంటల్ పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ విధంగా భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
సింహపురి పౌర సమాఖ్య నగర కార్యదర్శి అత్తిమూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో వున్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే పగులకొట్టమని పిలుపు నిచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు పెట్టటం సిగ్గు చేటన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉద్యమం సాగించాలని పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా “స్మార్ట్ మీటర్లు వద్దు” “కరెంట్ చార్జీలు తగ్గించాలని” డిమాండ్ చేసే స్టిక్కర్ లను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో సీపీఎం జిల్లా సెక్రటేరియేట్ సభ్యులు కఠారి అజయ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు కె.పెంచల నరసయ్య,నెల్లూరు సిటీ సెక్రటేరియేట్ సభ్యులు పి.సూర్యనారాయణ, ఆఫీస్ కార్యదర్శి పి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.