*”కూటమి పాలన విధ్వంసం” -కాకాణి*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:19-01-2025*

*కావలి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో గాయాలపాలై చికిత్స పొందుతున్న, బోగోలు మండలం, కోళ్లదిన్నె గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డిని, కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి పరామర్శించి, కుటుంబానికి ధైర్యం చెప్పిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*కావలి డీఎస్పీ గారిని కలిసి, జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరిన మాజీ మంత్రి కాకాణి.*

*మాజీ మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ…*

👉కూటమి ప్రభుత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు ఆనవాయితీగా మారిపోయాయి.

👉దాడికిగురైనటువంటి వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి కావలి ఆసుపత్రికి వస్తే, ఆసుపత్రి కాంపౌండ్ లో తెలుగుదేశం గుండాలు దాడి చేయడం దుర్మార్గం.

👉 చంద్రబాబు పరిపాలనలో దాడికి గురైనవారు గాయాలతో వైద్యం చేయించుకుందామని వస్తే ఆసుపత్రిలో కూడా దాడులు చేస్తున్నారు.

👉తెలుగుదేశం నాయకుల దాడులతో అన్యాయానికి గురై, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినా, తెలుగుదేశంపార్టీ నాయకులు ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్ లోనే దాడులకు పూనుకుంటున్నారు.

👉రాష్ట్రంలో ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎన్నడూ లేవు.

👉దాడులకు గురైన కుటుంబాన్ని పరామర్శించి, వాళ్లకు ధైర్యం చెప్పాలని నేను మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డిగారు, స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి వచ్చాము.

👉 జరిగినటువంటి సంఘటన వివరాలు శ్రీనివాసుల రెడ్డి దంపతులు చెప్తుంటే, కంటి వెంబడి నీళ్లు వచ్చేటువంటి దయనీయ పరిస్థితి.

👉కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినందుకు కక్ష సాధింపులకు పాల్పడుతూ, గత 7 నెలలుగా ఆ కుటుంబాన్ని చాలా రకాలుగా హింసించారు.

👉 అధికారం ఎప్పటికీ, ఎవ్వరికీ శాశ్వతంకాదని అధికారులు గుర్తుంచుకోవాలి.

👉కూటమి 7 నెలల కాలంలోనే ప్రజలు, కూటమికి ఎందుకు ఓటు వేశామా!, ఎందుకు పొరపాటు చేశామా! ఓటువేసి అన్యాయం పాలయ్యామే! అని ఆవేదన చెందుతున్నారు.

👉ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, మరలా తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొనివచ్చి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే లక్ష్యంతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.

👉తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవ్వరైన సరే, పోలీసుల అండదండలు లేకుండా గ్రామాల్లో తిరగలేకున్నారు.

👉 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, సానుభూతిపరులపై దాడులు చేసినవారిని, ఇబ్బందులకు గురిచేసినవారిని సప్తసముద్రాల అవతల ఉన్న సరే లాక్కొని వచ్చి, శిక్షిస్తాం, ఖచ్చితంగా ఎవ్వరినీ విడిచిపెట్టేది ఉండదు.

👉ఇకనైనా జిల్లా ఎస్పీ గారు స్పందించి, జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దాడులను నియంత్రించడానికి తక్షణమే చర్యలు చేపట్టి, శాంతిభద్రతలను కాపాడాలి.

👉తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలకు వంత పాడుతున్న పోలీసు అధికారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

👉కోళ్లదిన్నె గ్రామానికి చెందిన శ్రీనివాసుల కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసా కల్పించడానికే వచ్చాం.

👉 మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎప్పుడు ఏ చిన్న కష్టం వచ్చినా, నష్టం వాటిల్లినా, అండగా ఉండవలసిందిగా పిలుపునిచ్చారు.

👉జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *