*కార్యకర్తల కష్టమే సోమిరెడ్డి విజయం*
*సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి గెలుపొందడంలో కృషి చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు*
*వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్*
*స్క్రోలింగ్ పాయింట్స్ :-*
అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ ఐదేళ్ల పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన, కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన, టీడీపీ అన్న వారి ఆస్తులను కొల్లగొట్టిన, అరాచకాలు సృష్టించిన, దాడులు, దౌర్జన్యాలు చేసిన, అక్రమ కేసులు బనాయించిన వేటిని లెక్కచేయకుండా ఐదేళ్లపాటు ఎదురొడ్డి నిలబడి సోమిరెడ్డికి అండగా నిలిచిన ప్రతి ఒక్క టీడీపీ నేత, కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఎన్నికల్లో ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త తన శక్తికి మించి కష్టపడి పోరాడి సోమిరెడ్డి విజయం సాధించడంలో ఎంతో కీలకపాత్ర పోషించారు
ప్రజా ప్రభుత్వంలో సోమిరెడ్డి ద్వారా వెంకటాచలం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించుకుందాం
ఎన్నికల్లో వెంకటాచలం మండలానికి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుందాం
సోమిరెడ్డి విజయం కోసం అహర్నిశలు కష్టపడి శ్రమించిన మండల ప్రజలకు, అలుపెరుగని పోరాటం చేసిన ఎన్డీఏ నేతలకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు
గతంలో ఎన్నడు లేని విధంగా సోమిరెడ్డిని ఆదరించి, గెలిపించి అసెంబ్లీకి పంపేందుకు కృషి చేసిన మండల ప్రజలందరిని తెలుగుదేశం పార్టీ తన గుండెల్లో పెట్టుకుంటుంది
సోమిరెడ్డి విజయం టీడీపీ నేతలకు, కార్యకర్తలకు అంకితం
మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ పరిష్కారం దిశగా టీడీపీ అడుగులు వేస్తుంది
సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన కృషి ఎనలేనిది
సోమిరెడ్డి విజయానికి కృషి చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు