*కాకాణి హయాంలో ఇరిగేషన్ పనుల పేరుతో ఐదు ప్యాకేజీల్లో రూ.30 కోట్లు స్వాహా చేశారు : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*రీసర్వేతో భూరికార్డులు అస్తవ్యస్తం*
*ఏ ఊరికి వెళ్లినా భూసమస్యలపైనే ఫిర్యాదులు*
*కాకాణి హయాంలో ఇరిగేషన్ పనుల పేరుతో ఐదు ప్యాకేజీల్లో రూ.30 కోట్లు స్వాహా చేశారు
*టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.10.75 కోట్లతో 130కి పైగా పనులు చేయించాం*
*ఐదేళ్ల తర్వాత రైతుల భాగస్వామ్యంతో కాలువలు బాగుపడటంతో జీర్ణించుకోలేక కుట్రలు, కుతంత్రాల్లో కాకాణి*
*అన్నదాతలకు మేలు జరిగితే ఓర్వలేకపోతున్న కాకాణిది ఏం రక్తమో*
*పొదలకూరులో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో తాతముత్తాల నాటి ప్రజల ఆస్తుల రికార్డులను అస్తవ్యస్తం చేసేశారు
టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని సదస్సులు పెట్టినా సమస్యలు వస్తూనే ఉన్నాయి
కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో తహసీల్దార్లుగా స్వాతి, వీరవసంతరావులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు
ఆ ఇద్దరు అధికారుల అవినీతి, అక్రమాల కారణంగా అనేక మంది రైతులు బలయ్యారు
సూరాయపాళెంలో 36 ఎకరాల మేత పొరంబొకు భూములను పెద్దరెడ్లకు అప్పగించారు
మరుపూరులో ఆదాయపు పన్ను చెల్లించే వారి పేర్లతో ప్రభుత్వ భూములకు దొంగ పట్టాలు సృష్టించారు
ఇరిగేషన్ శాఖ పరిధిలో పనులు చేయకుండానే బిల్లులు చేసుకుని కాలువను సర్వనాశనం చేశారు
ఒక్క 2023 డిసెంబరులో కాలువల్లో నిండా నీళ్లు పారుతున్న సమయంలో ప్యాకేజీల పేరుతో రూ.30 కోట్లు భోంచేశారు
టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి పనిని పారదర్శకంగా చేపట్టాం.
రూ.10.75 కోట్లతో 130కి పైగా పనులను రైతుల భాగస్వామ్యంతో చేసి కాలువలకు కొత్త రూపు తెచ్చాం
అన్నదాతలకు మేలు జరిగితే ఓర్చుకోలేక కుట్రలకు పాల్పడుతున్న పెద్దమనిషిని సర్వేపల్లి నియోజకవర్గంలోనే చూస్తున్నాం
జాలి, దయ, మానవత్వం లేని కాకాణి గోవర్ధన్ రెడ్డి వంట్లో ఉండేది ఏమి రక్తమో