కాకాణి అక్రమ మద్యం దందా పుణ్యాన ఈ రోజు 16 మంది జైలులో ఉన్నారు. నా కారణంగా ఎన్నడూ ఎవరూ జైలుకెళ్లిన చరిత్ర లేదు : సోమిరెడ్డి
*నా గొంతులో ప్రాణం తప్ప ఏమీ లేదు. వరుస ఓటములతో అలసిపోయాను*
*సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో నిలిచేపోయే అభివృద్ధి పనులు చేయడమే నేను చేసిన తప్పా*
*రాజకీయ భిక్ష పెట్టిన పొదలకూరు మండలానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన పని ఒక్కటి లేకపోగా ఐదేళ్లుగా వేల కోట్ల ప్రకృతి సంపదను కొల్లగొట్టేశాడు*
*సాగు, తాగునీటి ప్రాజెక్టులను బీడు పెట్టాడు. పేదల ఆకలి తీర్చే అన్నం క్యాంటీన్ మూసేశాడు*
*ఇద్దరి మధ్య తేడాను గమనించి రేపు ఓటు విషయంలో నిర్ణయం తీసుకోండి*
*ఈ ఒక్కసారి ఓటు వేసి సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి*
*పొదలకూరు బస్టాండ్ సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
తెలుగుదేశం పార్టీ కూటమి కార్యక్రమాలకు పోటెత్తుతున్న జనసమూహంతో తోడేరు రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు
రెండు నెలలుగా వేదాయపాళెం కార్యాలయంలో పండగలా జరిగిన చేరికలతోనే ఆయన కాకాణి ఓటమి ఖాయమైపోయింది
రాజకీయ జీవితంలో చేసిన ఒక్క మంచి పనిని కూడా ప్రచారంలో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు
మొదటి నుంచి ఆయనకు తెలిసింది ఒక్కటే నోటికొచ్చినట్టు నన్ను బూతులు తిట్టడం, నా తల్లిదండ్రులను కూడా దూషించడం
దోచుకోవడం..దాచుకోవడం తప్ప పొదలకూరు మండలంలో ఆయన చేసిన పని ఒక్కటి లేదు..ఆయనకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది
అత్యంత నీచచరిత్ర కలిగిన దురదృష్టకరమైన వ్యక్తి చేతిలో రెండు సార్లు ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నాను
ఆర్యవైశ్యులు ఒకరి జోలికిపోరు. అటువంటి ఆర్యవైశ్యుల్లో 19 మందిని జైలులో పెట్టిన కిరాతకుడు కాకాణి
వెంకటాచలం మండలంలో ఇద్దరు ముస్లిం యువకులు ఎస్సై కరిముల్లా చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఒక గిరిజనుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఆ ఎస్సైపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి పొదలకూరుకు తీసుకొచ్చాడు
ఆ ఎస్సై చేతిలో దళిత సోదరుడు ఉదయగిరి నారాయణ లాకప్ డెత్ కు గురయ్యాడు
అప్పటికి కూడా కరిముల్లాపై చర్యలు తీసుకోకుండా నారాయణది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సహకరించాడు
ఉదయగిరి నారాయణ తీవ్రమైన గాయాలతో చనిపోయాడని వైద్యులే నాకు సమాచారమిచ్చారు. కానీ పోస్టుమార్టం రిపోర్టును ఆత్మహత్యగా మార్చారు
రీ పోస్టుమార్టం జరిగితే ఎస్సై కరిముల్లా కిరాతకం బయటపడుతుందని కాకాణి ఒత్తిడితో 70 మంది పోలీసులను బందోబస్తుగా పెట్టి కుల సంప్రదాయాలకు విరుద్ధంగా నారాయణ మృతదేహాన్ని దహనం చేయించారు
జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసి నారాయణ కుటుంబానికి అండగా నిలిచాం. చట్టప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలను కల్పించాం
స్వాతంత్ర్యం వచ్చాక సర్వేపల్లి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నేరాలు- ఘోరాలు ఈ ఐదేళ్లలో కాకాణి ఆధ్వర్యంలో జరిగాయి
వరదాపురం మైన్ లో వందల కోట్ల విలువైన క్వార్ట్జ్ కొల్లగొట్టేశాడు. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసిన నా పైకి హిజ్రాలను ఉసిగొల్పిన వ్యక్తి గోవర్ధన్ రెడ్డి
పొదలకూరు మండలాన్ని భూదందాలకు అడ్డాగా మార్చాడు
మేకలు పొట్ట రాసుకుంటేనే కూలిపోయేలా గిరిజనుల ఇళ్లకు గోడలు కట్టించి తాను మాత్రం లంకంత కొంపలు కట్టించుకున్నాడు
కోట్లాది రూపాయలతో కట్టించిన కరోనా ప్యాలెస్ తనది కాదని కాకాణి చెప్పగలడా
రామదాసుకండ్రిగలో పేదల భూములను అల్లుడికి దారాధత్తం చేశాడు
కాకాణి అక్రమ మద్యం దందా పుణ్యాన ఈ రోజు 16 మంది జైలులో ఉన్నారు. నా కారణంగా ఎన్నడూ ఎవరూ జైలుకెళ్లిన చరిత్ర లేదు
2009లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిచినా కాకాణే పెత్తనం చేశాడు. కానీ చీకిరిపుల్లంత పనిచేశాడా
2014, 2019లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మంత్రిని చేశారు. అయినా పొదలకూరు మండలానికి ఒరిగింది శూన్యం
2014లో నేను ఓడినా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యా, మంత్రిగా బాధ్యతలు చేపట్టా
పొదలకూరు మండలం ప్రజలకు రూ.2 కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించేందుకు మెగా వాటర్ ప్లాంటు నిర్మించడం నేను చేసిన తప్పా
పేదలు వైద్యం పొందే ఆస్పత్రి పాడుబడివుంటే దానిని పగలగొట్టించి రూ.3.80 కోట్లతో కొత్త బిల్డింగ్ కట్టించడం నేను చేసినా నేరామా
కండలేరు ఎడమకాలువకు రూ.62 కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేయించి రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు సాగు నీరందించడం, నాన్ డెల్టాను డెల్టాగా మార్చడం నేను చేసిన తప్పా
సోమశిల దక్షిణ కాలువను తిరుపతినాయుడుపల్లి వద్ద సైఫన్ నుంచి వంక దాటించడం, రూ.7 కోట్లతో పెండింగ్ పనులు చేపట్టడం నేను చేసినా తప్పా
ఐటీఐ భవనాలు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లో భవనాల నిర్మాణానికి రూ.6 కోట్లకు పైగా నిధులు తెచ్చాను
నిమ్మ మార్కెట్ లో 24 కొట్లు కట్టించాను. మార్కెట్ ఆవరణంతా సిమెంట్ రోడ్లు వేయించాను.
ఏఐఐబీ నిధులు కోట్లాది రూపాయలు తెచ్చి నల్లబాళెం, పార్లపల్లి, దుగ్గుంట లాంటి గ్రామాలకు రోడ్లు వేయించడం తప్పా
పేదలకు రూ.5కే అన్నం పెట్టేందుకు పొదలకూరులో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయించడం తప్పా
ఇన్ని చేసిన నాకు ఓటు వేసేందుకు పొదలకూరు మండల ప్రజలు ఎందుకు ఆలోచిస్తున్నారు
ఇప్పటికే చాలా అలిసిపోయాను. ఇక నా గొంతులో ప్రాణం ఒక్కటే మిగిలివుంది
ఈ ఒక్కసారి సర్వేపల్లి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి