కల్లూరు పల్లి ఇందిరమ్మ కాలనీ, కాటికాపర్ల కాలనీ, ఎస్.టి కాలనీ ప్రాంతాలలోని నిర్వాసిత ప్రజలకు 300 మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను బుధవారం వార్డు సచివాలయ కార్యదర్శులు పంపిణీ

మెంథా తుఫాను ప్రభావంతో నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సహాయక చర్యల్లో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు స్థానిక 24వ డివిజన్ కల్లూరు పల్లి ఇందిరమ్మ కాలనీ, కాటికాపర్ల కాలనీ, ఎస్.టి కాలనీ ప్రాంతాలలోని నిర్వాసిత ప్రజలకు 300 మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను బుధవారం వార్డు సచివాలయ కార్యదర్శులు పంపిణీ చేశారు.

స్థానిక కార్పొరేటర్ అరవ శ్రీనివాసులు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వై. శ్రీనివాసులు, అడ్మిన్ కార్యదర్శి ముని కిరణ్, విలేజ్ రెవెన్యూ కార్యదర్శి జనార్ధన్, వెల్ఫేర్ కార్యదర్శి షబ్బీర్, శానిటేషన్ కార్యదర్శి బ్రహ్మనాయుడు, ప్లానింగ్ కార్యదర్శి ఖుదియా హసన్, మహిళా పోలీస్ కార్యదర్శి దేవి, ఏ.ఎన్.ఎం నీలిమ, బిల్ కలెక్టర్ గోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *