*ఐదేళ్ల తర్వాత మళ్లీ ట్రాక్ లోకి సంక్షేమ పథకాలు*
*వైసీపీ పాలనలో మూలనపెట్టేసిన కార్యక్రమాలకు బూజు దులుపుతున్న టీడీపీ కూటమి*
*వెంకటాచలంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన మత్స్యకారులకు సైకిళ్లు, వలల పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
42 మంది గిరిజనులకు సైకిళ్లు, చేపల వలలు పంపిణీ చేశాం
ఒక్కో యూనిట్ విలువ రూ.10 వేలు కాగా, లబ్ధిదారుడి వాటా రూ.1000 మాత్రమే
2019-20 ఆర్థిక సంవత్సరంలో గిరిజన బిడ్డలకు మంజూరైన ఈ యూనిట్ల పంపిణీని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లూ పక్కనపెట్టేసింది
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి సంక్షేమ ఫలాల పంపిణీ పున:ప్రారంభమైంది
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం జిల్లాలో 38 భవిత కేంద్రాలు పనిచేస్తున్నాయి
ఈ కేంద్రాల్లో 734 మంది చిన్నారులు ఉండగా, వారికి 72 మంది సేవ చేస్తున్నారు
భవిత కేంద్రాల్లో చిన్నారులకు సేవలు అందించడంలో ఆయాలు చేస్తున్న కృషి అభినందనీయమైనది.
ఆ చిన్నారుల్లో అవసరమైన వారికి ఈరోజు వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశాం
స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి
వైసీపీ ఐదేళ్ల పాలనలో గిరిజనుల సంక్షేమాన్ని కూడా అప్పటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసేసింది
బటన్ నొక్కుడు తప్ప మిగిలిన కార్యక్రమాలన్నింటిని జగన్ రెడ్డి గాలికొదిలేశారు
బీసీ రెసిడెన్షియల్ స్కూలు కోసం స్థలాన్ని మంజూరు చేయడంతో పాటు భవనాల నిర్మాణానికి కృషి చేస్తాం