*విషాద వార్త :*
*ఏపీ మునిసిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సుబ్బు కు నివాళులు అర్పించిన నాయకులు మరియు కార్మికులు*
*నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ లో అత్యంత చొరవగా ప్రతి కార్మికుడితో మాట్లాడే వ్యక్తి. డ్రైవర్స్ కమిటీ అధ్యక్షుడిగా ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి*
*అందరూ ఆప్యాయంగా పిలుచుకునే సుబ్బు @ చెరుకూరు. సుబ్రహ్మణ్యం దురదృష్టవ శాత్తు ఈరోజు మధ్యాహ్నం నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.*
*సంతపేట లోని బుజ్జమ్మ రేపు వద్దనున్న సుబ్బు గారి స్వగృహం వద్దకు మృతదేహాన్ని ఇప్పుడే తరలించడం జరిగింది.*
*మునిసిపల్ కార్మికుల హక్కుల సాధనకై జరిగిన అనేక పోరాటాల్లో,ఎంతో చొరవతో, ధైర్యంగా కార్మికుల అందరిని ఉత్సాహపరుస్తూ, ఉత్తేజపరుస్తూ పాల్గొన్న సుబ్బు మనకు దూరమవడం మనందరికీ తీరని లోటు.*
*సుబ్బు మృతికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు), నెల్లూరు నగర కమిటీ తరపున తీవ్ర సంతాపాన్ని, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.*
*వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాము.*
*జోహార్ జోహార్ సుబ్బు*