*ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన.. జులై 3 న జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా పర్యటన తద్యం* .. ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ..
—————————————-
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో.. తిరుపతి ఎంపీ *గురుమూర్తి* గారు.. ఎమ్మెల్సీ లు *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు, *మేరిగా మురళిధర్* గారు, మాజీమంత్రి *అనిల్ కుమార్ యాదవ్* గారు.. రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ *ఆనం విజయకుమార్ రెడ్డి* గారు, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ చార్జ్ *కిలివేటి సంజీవయ్య* గారు, *కాకాణి పూజిత* గారు.. మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు..
ప్రెస్ మీట్..
*యంపి గురు మూర్తి కామెంట్స్*
మూడవ తేదీన నెల్లూరు కు మాజీ సీఎం జగన్ రానున్నారు
జగన్ పర్యటన అడ్డుకునేందకు కూటమి పెద్దలు, అధికారులు ప్రయత్నం చేయడం దుర్మార్గం.
27వ తేదీ నుంచి హెలిప్యాడ్ కు పలు ప్రాంతాలు పరిశీలించి..అనుమతి కోరిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని జగనన్న ములాఖాత్ అవుతారు
*మాజీ మంత్రి అనిల్ కామెంట్స్*
పది రోజుల క్రితమే చెప్పాం జగనన్న పర్యటన ఉందని
హెలి ప్యాడ్ పరిమిషన్ కోసం అధికారులను అడిగితే సమాధానం లేదు
పరిమిషన్ ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు… జగన్ పర్యటన ఆపేందుకే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
జగన్ పర్యటన పై ఎందుకు అంత భయం
మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన 3వ తేదీ జగన్ రావడం తథ్యం
*ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి కెమెంట్స్*
👉 *జులై 3వ తేదీ జగన్ పర్యటన ముందుగానే ప్రకటించాము.*
👉 *కాకాణి అక్రమ అరెస్ట్ అనంతరం జగన్ నెల్లూరు రావడం జరుగుతుంది*
👉 *కొత్తూరు లోని సెయింట్ యాన్స్ స్కూల్.. కాకుటూరులో మరో ల్యాండ్ హెలి ప్యాడ్ కు .. కేటాయించమని అధికారులను కోరినప్పటికీ కుంటి సాకులు చెప్పి.. తప్పించుకుంటున్నారు.*
👉 *సెయింట్ యాన్స్ స్కూల్.. యాజమాన్యాన్ని అధికార పార్టీ నేతలు బెదిరించి.. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అడ్డంకులు సృష్టించారు.*
👉 *సమయం లేదు మాకు హెలి ప్యాడ్ కు స్థలం కేటాయించండి అని అధికారులని.. మేము అడుగుతుంటే.. ఈరోజు జైలుకు సమీపంలో.. ముళ్ళపొదలు, రెండు పక్కల హై టెన్షన్ వైర్లు.. అప్రోచ్ రోడ్ కూడా లేని.. స్థలాన్ని చూపి ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెప్పడం… దుర్మార్గం.*
👉 *అధికారుల షరతులు, జైలు వద్ద స్థలం సరైనది కాదు..*
👉 *జగన్ వస్తున్నారంటే ముందుగా కాకాణి పై , పిటి వారెంట్ పెట్టి కోర్టుకు తరలించడం.. చేస్తారన్న అనుమానం కూడా ఉంది.*
👉 *కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అధికారులు జైలు నుంచి మరోచోటికి తరలించిన జగన్మోహన్ రెడ్డి గారు జులై 3 వ తేదీ నెల్లూరు కు వచ్చి వారి కుటుంబ సభ్యులనైనా పరామర్శించి వెళ్తారని తెలిపారు.*
👉 *రాష్ట్రంలో ఒక వ్యక్తి కి తిరిగే స్వేచ్ఛ లేదా.. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు*
👉 *జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలనే.. ఆలోచనలోని కూటమినేతలు ఉన్నారని.. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కూటమినేతలో భయం పుట్టుకొస్తుందన్నారు.*
👉 *కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో అధికారం లోకి వచ్చి..ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి రావాలంటే ఆ పార్టీ నేతలకు భయం పుట్టుకుందన్నారు.*
👉 *ఎన్ని కండిషన్స్ పెట్టిన సరే నెల్లూరుకు జులై 3 న జగన్ మోహన్ రెడ్డి గారు రావడం తథ్యమన్నారు.*
👉 *ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన నెల్లూరు జగన్ పర్యటన ప్రభంజనంలా మారబోతుందన్నారు*