*ఎమ్మెల్యే ప్రశాంతమ్మ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు*

– నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సాహంగా జన్మదిన వేడుకలు.
– వాడ వాడలా కేక్ కటింగులు, రక్తదాన శిబిరాలు.
– టిడిపి, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఉచిత వైద్య శిబిరాలు.

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కోవూరు మండల కేంద్రంలోని పివిఆర్ కల్యాణ మండపంలో టిడిపి మాజీ మండలాధ్యక్షులు మరియు తెలుగుయువత ఆధ్వర్యంలో మెడికవర్, జయభారత్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరంలో పాటు 130 మంది రక్తదానం చేశారు. కోవూరు టిడిపి అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇనుమడుగులో 150 మంది రక్తదానం చేశారు. విడవలూరు మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షులు ఏటూరి శ్రీహరి రెడ్డి, టీడీపీ నేతలు అడపాల శ్రీహరి రెడ్డి, పూండ్ల అచ్యుత్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో 106 మంది రక్తదానం చేశారు.

బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, మాజీ పట్టణ అధ్యక్షులు ఎంవి శేషయ్య గార్ల ఆధ్వర్యంలో 125 మంది రక్తదానం చేశారు. ఇందుకూరు పేట మండలంలో మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు, పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 150 మంది రక్తదానం చేయగా కొడవలూరు మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు గారి ఆధ్వర్యంలో 170 మంది నాయకులు మరియు కార్యకర్తలు రక్తదానం చేసి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి తమకున్న అభిమానాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నాయకులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా భాగంగా ఆడంబరాలకు దూరంగా ఆమె జన్మదినం సందర్భంగా చెట్లు నాటడం, రక్తదాన మరియు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *