*ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చొరవతో పారిశుద్ధ్య చర్యలు*
కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చొరవతో కొడవలూరు మండలం మానేగుంటపాడు ఎస్టి కాలనీలో అధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టారు.
మానేగుంటపాడు ఎస్టీ కాలనీలో అపరిశుభ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దృష్టికి తీసుకువెళ్లారు.
దాంతో వెంటనే స్పందించిన ఎంఎల్ఏ మండల ఎంపిడిఓ దృష్టికి తీసుకువెళ్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఆదేశాలతో అధికారులు గ్రామానికి వెళ్లి కాలువల్లో పూడిక తీయించారు. పారిశుద్ధ్య చర్యలు తీసుకున్నారు.
గ్రామాల్లో రోగాలు వ్యాప్తి చెందకుండా పకడ్బంది చర్యలు చేపట్టారు. త్వరలో కాలనీలో నూతన మురుగు కాలువలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ మేరకు అంచనాలు తయారు చేయించామని, త్వరలో కాలువల నిర్మాణం చేపడతామని వివరించారు.