*ఎన్నికల ఫలితాల్లో కంగనా రనౌత్‌, పవన్‌ కల్యాణ్‌ హవా.. సినీ తారల విక్టరీ వివరాలివే*

నేడు దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు ఏపీ అసెంబ్లీ స్థానాల ఎన్నికలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎన్నికల్లో సినీ తారలు బరిలోకి దిగిన తమ విక్టరీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. రాష్ట్రాలు, స్థానాల వారిగా తారల విక్టరీ వివరాలివే…

హిమాచల్ ప్రదేశ్‌..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ హోం టౌన్‌ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి విక్టరీ విజయాన్ని కైవసం చేసుకున్నారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన కంగనారనౌత్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్‌పై 71 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో..

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ప్రత్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు.

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్‌ సాధించారు. ఇప్పటికే రెండు సార్లు గెలుపొందిన బాలకృష్ణ మూడోసారి 31,602 ఓట్ల మెజారిటీతో గెలుపొంది హ్యాట్రిక్‌ విజయం అందుకున్నారు.

కేరళలో..

మలయాళ నటుడు సురేశ్‌ గోపీ 75,079 ఓట్ల భారీ మెజారిటీతో త్రిస్సూర్ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి వీఎస్‌ సునీల్‌ కుమార్‌ రెండో స్థానానికి పరిమితమయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లో..
ఉత్తరప్రదేశ్ లోని మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న హేమమాలిని 2,41,500 ఓట్ల ఆధిక్యం (బీజేపీ)లో కొనసాగుతుండగా.. విక్టరీ విజయం ఖాయమైపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ లోక్‌ సభ నియోజవర్గం నుంచి పాపులర్‌ నటుడు రవికిషన్‌ 74,536 ఓట్ల ఆధిక్యంతో (బీజేపీ) గెలుపు దాదాపు ఖాయం చేసుకున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed