*ఎంపీ వేమిరెడ్డి సహకారంతో జిల్లాకు BSNL టవర్స్*

నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు, టెలికం అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో నెల్లూరు జిల్లాకు 35 BSNL టవర్స్ మంజూరు అయ్యాయి.

ఇటీవల నెల్లూరులోని బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులతో టెలికం అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో నెట్‌వర్స్‌ సమస్యలపై ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.

అలాగే టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. వీటన్నింటిపై చర్చించిన ఎంపీ, అధికారులు.. నెట్‌వర్క్‌ సమస్యల పరిష్కారంపై దృష్టికి సారించాలని తీర్మానించారు.

ఈ మేరకు 35 టవర్లు మంజూరు అయ్యాయి. టవర్ల ఏర్పాటుతో నెట్‌వర్క్‌ సమస్యలు పరిష్కారం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *