*ఎంపీ వేమిరెడ్డి కృషితో జిల్లాకు కొత్తగా 10 టవర్స్ మంజూరు*

– నెట్వర్క్ లేని గ్రామాల్లో బలోపేతం కానున్న టెలికాం సేవలు
– ఎంపీ కి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఆయా గ్రామ ప్రజలు

నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు, టెలికం అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో నెల్లూరు జిల్లాకు కొత్తగా 10 BSNL 4g టవర్స్ మంజూరు అయ్యాయి. ఈ మేరకు గురువారం కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాలిచ్చారు.

ఇటీవల నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ లేని కారణంగా ఆయా గ్రామాల్లో ప్రస్తుతం మొబైల్ సేవలు అందుబాటులో లేవని కేంద్ర టెలికాం, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. టవర్స్ ఏర్పాటుతో ఇ-గవర్నమెంట్ సేవల పంపిణీ, ఆన్‌లైన్ విద్య, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా ఆర్థిక చేరిక, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు మరియు మొబైల్ కనెక్టివిటీపై ఆధారపడిన ఇతర ముఖ్యమైన సేవలను మెరుగుపరచవచ్చని వివరించారు. టవర్ల పరిధిలో లేని గ్రామాల్లో మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, విజ్ఞప్తి చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి మేరకు జిల్లాలో కొత్తగా 10 టవర్లను సంబంధిత శాఖ మంజూరు చేసింది.

* ఆత్మకూరు నియోజక వర్గంలోని అనుమసముద్రంపేట మండలం చౌట భీమవరం, అనంతసాగరం మండలం వరికుంటపాడు, మర్రిపాడు మండలం చిలకపాడులో టవర్ మంజూరు అయ్యింది.

* ఇక కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలంలోని ప్రముఖ దేవాలయం మాలకొండ కు టవర్ మంజూరు చేశారు.

* కావలి నియోజకవర్గం దగదర్తి మండలం దుండిగం గ్రామానికి టవర్ మంజూరు అయ్యింది.

* ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం మహమ్మదపురం, విరువూరు, సీతారామపురం మండలం వేంపల్లి తోక, కొండాపురం మండలం వెలిగండ్ల, దుత్తలూరు మండలం ఏరుకొల్లు గ్రామాలకు టవర్స్ మంజూరు చేశారు.

టవర్స్ మంజూరుతో ఆయా గ్రామాల ప్రజలు, స్తానిక ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషితో తమకు ఇక నెట్వర్క్ సమస్యలు తొలగనున్నాయని హర్షం వెలిబుచ్చుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed