*ఉదయ కాళేశ్వర స్వామి తెప్పోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*
కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని గంగ పార్వతి సామెత ఉదయ కాళేశ్వర స్వామి వారి తెప్పోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గండవరం శివాలయం ఎంతో విశిష్టిత కలిగిన చారితాత్మక శైవ క్షేత్రమని అభివర్ణించారు. చోళ రాజుల కాలం నాటి శతాబ్దాల చరిత్ర కలిగిన ఉదయ కాళేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే ఇటువంటి ధార్మిక ఉత్సవాలతో దైవిక చింతనతో పాటు గ్రామ ఐక్యతకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరా కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి టిడిపి నాయకులు ఆవుల వాసు తదితరులు పాల్గొన్నారు.