*ఉత్తమ పంచాయతిగా మిక్కిలింపేట*
– కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖచే ప్రశంశా పత్రం అందుకున్న సర్పంచ్.
– ఉత్తమ సర్పంచ్ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి గారిని సన్మానించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతులు.
కొడవలూరు మండలం మిక్కిలింపేట సర్పంచ్ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామ సర్పంచ్ గ్రామాభివృద్ధికి పాటు పడాలని కోరారు వేమిరెడ్డి దంపతులు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేర్చడంలో ప్రత్యేక శ్రద్ధ చూపి జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్ గా ప్రశంసలందుకున్న కొడవలూరు మండలం మిక్కిలింపేట సర్పంచ్ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి దంపతులు సన్మానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి అర్హులకు చేర్చడంలో గ్రామ సర్పంచులు చొరవ చూపాలన్నారు. గ్రామాలలో ప్రజలకు సురక్షిత తాగునీటి సదుపాయాలతో పాటు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు.