*ఉగాది, రంజాన్ పండుగల ఏర్పాట్ల పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీక్ష*
– మసీదులు, ఆలయాల వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టండి.
– భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నీటి వసతి కల్పించండి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ఉగాది మరియు రంజాన్ పండుగల సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో వుంచుకొని దేవాలయాలు మరియు మసీదుల వద్ద తాగునీటి సరఫరా పారిశుధ్య ఏర్పాట్లు చేపట్టాలన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఆమె నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చి, విడవలూరు, కొడవలూరు మండలాల తహసీల్దారులు, ఎంపిడిఓలు మరియు గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. హిందూ ముస్లిం ప్రార్ధనా మందిరాల వద్ద సామూహిక ప్రార్థనలలో పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఎటువంటి అసౌక్యరం రాకుండా చూడాలని కోరారు. ప్రార్ధనా మందిరాల వద్ద ఆకతాయిల పై ఓ కన్నేసి ఉంచాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు నియోజకవర్గ ప్రజలకు ముందస్తు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి పాళెం పట్టణ కమీషనర్ డి బాలకృష్ణ, ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, చెంచు కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.