
*ఈనెల డిసెంబరు 13వ తారీఖున జరిగిన నేషనల్ లోక్ అదాలత్ నందు బకాయిలను చెల్లించని భవన యజమానులు కోర్టు ద్వారా తదుపరి చర్యలు చేపట్టవలసిందిగా సిబ్బందిని ఆదేశించిన కమిషనర్ వై ఓ నందన్*
నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా ఇంజనీరింగ్ విభాగము వారితో గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 13వ తారీఖున జరిగిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో కొళాయి పన్నులు వసూళ్లు బాగా జరిగాయని ఇంజనీరింగ్ విభాగము వారిని ఈ సందర్భంగా అభినందించారు.
ప్రతి వార్డులో తాగునీటి సరఫరా సమయంలో నీటి నాణ్యతను విధిగా పరీక్షించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇంజనీరింగ్ సిబ్బంది, ఫిట్టర్లు లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈనెల 31 లోపు అనధికారికంగా ఉన్నటువంటి కొళాయిలను గుర్తించి, సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయాలని అలాగే వాటిని రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు.
ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకు మూడు నెలలు మాత్రమే గడువు ఉందని కావున పై స్థాయి అధికారి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు కష్టపడి పనిచేసే అనుకున్న లక్ష్యం సాధించాలని ఈ సందర్భంగా సిబ్బందిని కోరారు.
నగరపాలక సంస్థకు చెల్లించవలసిన బకాయిలను సంబంధిత భవన యజమానికి తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే గతవారం నుంచి ఈ వారం వరకు ఫిట్టర్ల వారీగా ఎన్ని అనధికారిక కుళాయిలను గుర్తించారో, రెగ్యులరైజేషన్ ఎన్ని పూర్తి చేశారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈనెల డిసెంబరు 13వ తారీఖున జరిగిన నేషనల్ లోక్ అదాలత్ నందు బకాయిలను చెల్లించని భవన యజమానులు కోర్టు ద్వారా తదుపరి చర్యలు చేపట్టవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ టి.పి.ఆర్.ఓ. వాసు బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శేషగిరిరావు, రహంతు జానీ, అనిల్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆమెనిటీస్ కార్యదర్శులు, ఫిట్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.